విద్యార్ధులు అందరూ క్షేమమే...ఆటా భీంరెడ్డి..!!

అమెరికాలో అరెస్ట్ కాబడిన విద్యార్ధులు అందరూ క్షేమంగా ఉన్నారని, వారి భద్రతా విషయంలో ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదని విద్యార్ధుల తల్లి తండ్రులకి ఆటా అధ్యక్షులు భీంరెడ్డి తెలిపారు.

భారతీయ ఎంబసీ హోల్యాండ్ సెక్రటరీ అధికారులను కలిసి విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ఆయన అన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఒకే సెల్ లో ఎక్కువ మంది విద్యార్ధులని ఉంచి ఇబ్బందుల పాలు చేస్తున్నారని వస్తున్నా వార్తల్లో వాస్తవం లేదని అందుకు గాను ఎవరు కంగారు పడకండిని అన్నారు.

అమెరికా పోలీసు సిబ్బంది కూడా తమకి సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ముఖ్యంగా విద్యార్ధుల తల్లి తండ్రులు కంగారు పడవద్దని ఎవరికీ ఏదైనా ఆందోళన కలిగినా సరే వెంటనే తమని సంప్రదించండి అంటూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రకటించారు.

8442827382 అనే నెంబర్ కి ఎటువంటి అవసరం వచ్చినా ఫోన్ చేయాలని ఇది ఆటా హెల్ప్ లైన్ నెంబర్ అని ఆయన అన్నారు.

తెలుగు విద్యార్ధుల కోసం అక్కడ తెలుగు సంఘాలు ఎంతగానో కృషి చేయడం విద్యార్ధుల తల్లి తండ్రులకి ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది.

సాయంత్రం హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా