ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భీమ్ పురస్కారం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా త్రిబుల్ ఐటీ లో సీట్ సాధించిన విద్యార్థులతో పాటు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమాన్లకు భీమ్ ప్రతిభ పురస్కారం మంగళవారం భీమ్ యువత ఆధ్వర్యంలో అందజేశారు.

ఈ సందర్బంగా భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని స్వతంత్ర దేశంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరు అందుకోవాలంటే, విద్య ఎంతో అవసరం అని విద్యలో ఓ అంబేడ్కర్ లాగా ఉన్నత స్థాయికి వెళ్లి ఈ దేశ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు.

చదువు నేర్చుకునే స్థాయి నుండి చదువు చెప్పే స్థాయికి, ఓటు వేసే స్థాయి నుండి ఓటు వేయించుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

చప్పట్లు కొట్టే స్థాయి నుండి చప్పట్లు కొట్టించుకునే స్థాయికి విద్యార్థులు చేరుకోవాలని కోరారు.

విద్యార్థులు ప్రతి రోజు వచ్చేటప్పుడు మెదడులో ప్రశ్నలు నింపుకొని రావాలని అవి బడిలో నివృత్తి చేసుకోవాలన్నారు.

రేపటి రోజు అన్యాయాన్ని, అధర్మాన్ని, అవినీతిని, అసమానతలను ప్రశ్నించే స్థాయికి ఎదిగినప్పుడే మన జీవితాలు వెలుగులు నింపుకుంటాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్త చెన్నయ్య, రేసు శంకర్ , లింగాల దాసు, గడ్డం వెంకటేష్, అంబటి విజయ్,కొత్త అరుణ్, లింగాల సందీప్, జాను, రాకేష్, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత, పాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ పందిర్ల నాగరాణి, ఎస్ఎంసి చైర్మన్, సభ్యులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

అమెరికా రాష్ట్ర సభలు, లోకల్ బాడీల బరిలో ప్రవాస భారతీయులు .. ఎంత మందో తెలుసా?