తప్పుడు కామెంట్లు పెడితే జైలు కూడే.. వార్నింగ్ ఇచ్చిన భవ్య భిష్ణోయ్?
TeluguStop.com
రెండు రోజుల క్రితం హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థంను రద్దు చేసుకుని అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన వారికి సైతం భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలో మెహ్రీన్ పెళ్లి తేదీని ప్రకటిస్తారని అనుకుంటున్న తరుణంలో ఆమె నుంచి షాకింగ్ ప్రకటన వెలువడింది.
నిశ్చితార్థం రద్దు చేసుకున్న మెహ్రీన్ భవ్య భిష్ణోయ్ తో కానీ, అతని కుటుంబంతో కానీ ఇకపై ఎటువంటి సంప్రదింపులు జరపనని ఆమె అన్నారు.
"""/"/
పెళ్లికి సంబంధించి మెహ్రీన్ కొన్ని రోజుల క్రితమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆలస్యంగా అభిమానులకు వివరాలను వెల్లడించారని సమాచారం.
అయితే మెహ్రీన్ చేసిన ప్రకటన వల్ల ఆమె అభిమానులలో చాలామంది భవ్యభిష్ణోయ్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
భవ్య భిష్ణోయ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో పాటు కొందరు అభిమానులు ఘాటు పదజాలంతో భవ్య భిష్ణోయ్ పై విరుచుకుపడుతున్నారు.
అయితే తనను, తన ఫ్యామిలినీ ఏ తప్పు చేయకపోయినా ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో భవ్య భిష్ణోయ్ సీరియస్ గా స్పందించారు.
ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భవ్య భిష్ణోయ్ చెప్పుకొచ్చారు.
తనపై, తన కుటుంబంపై నిందలు వేసేవాళ్లు జైలుకూడు తినక తప్పదని భవ్య భిష్ణోయ్ హెచ్చరించడం గమనార్హం.
నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి గల కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని భవ్య భిష్ణోయ్ పేర్కొన్నారు.
"""/"/
తాను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని భవ్య భిష్ణోయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇతరులకు తాను సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని భవ్య భిష్ణోయ్ కామెంట్లు చేశారు.
తన కుటుంబంను ఎవరైనా దూషిస్తే మాత్రం వారిపై సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ లో ఫిర్యాదు చేస్తానని భవ్య భిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చారు.
భవ్య భిష్ణోయ్ వార్నింగ్ తో ట్రోల్స్ ఆగుతాయేమో చూడాల్సి ఉంది.
యూకేలో గోమాంసం వడ్డనతో ఆ గుంపు విధ్వంసం.. షాకింగ్ వీడియో లీక్..!!