రామ మందిరం నిర్మాణం కోసం 52 లక్షలు సేకరించిన బాలిక.. ఈమె భక్తికి ఫిదా అవ్వాల్సిందే!

మన దేశంలోని హిందువులు అయోధ్య శ్రీరాముడిని( Ayodhya Sri Ram ) ఎంతో భక్తితో పూజిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రామ మందిరం నిర్మాణం కోసం మన దేశంలోని ఎంతోమంది ప్రముఖులు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే గుజరాత్ కు చెందిన ఒక బాలిక ఏకంగా 52 లక్షల రూపాయలను విరాళాలుగా సేకరించి ఇచ్చింది.

చిన్న వయస్సులో బాలిక ఎక్కువ మొత్తం విరాళంగా ప్రకటించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఆ బాలిక పేరు భవికా మహేశ్వరి కాగా సూరత్ కు చెందిన ఈ బాలిక రామ మందిరం నిర్మాణం జరుగుతుందని తెలిసిన వెంటనే తన వంతు విరాళంగా అందించాలని భావించారు.

రామాయణంపై ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలను చదవడం ఆమె మొదలుపెట్టారు.2021 సంవత్సరంలో ఖైదీలకు రాముని గొప్పదనం చెప్పి లక్ష రూపాయలు విరాళంగా సేకరించిన భవికా మహేశ్వరి 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 300 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు.

"""/" / ఈ 300 ప్రదర్శనల ద్వారా ఆ బాలిక ఏకంగా 52 లక్షల రూపాయలు సేకరించి ఆ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

భవికా మహేశ్వరి రాముడి గాథను ప్రదర్శించడంతో పాటు 108 కంటే ఎక్కువగా వీడియోలను రికార్డ్ చేసి ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం జరిగింది.

ఈ బాలికకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈమె భక్తికి ఫిదా అవుతున్నారు.

"""/" / భవికా మహేశ్వరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu ) గురించి ఒక పుస్తకాన్ని సైతం రాశారు.

భవికా మహేశ్వరి కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరింత సక్సెస్ కావాలని ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దూకుడు పెంచిన ఐటీ అధికారులు…దిల్ రాజుతో పాటు మైత్రి పై ఐటి దాడులు?