ప్రవాస భారతీయుడికి అమెరికాలో కీలక పదవి..!!

భారత్ నుంచి దేశ విదేశాలకు ఎంతో మంది ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగ, వ్యాపారాల కోసమో వలసలు వెళ్తూ ఉంటారు.

అలా వలసలు వెళ్ళిన వాళ్ళు అక్కడే స్థిరపడిపోయి స్థానికంగా ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళుఎంతో మంది ఉన్నారు.

ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో భారత ఎన్నారైలకు కొదవ లేదు.ఒకరకంగా చెప్పాలంటే అమెరికా ఇప్పుడు ఈ స్థాయిలో అగ్ర రాజ్య హోదాలో కూర్చుందంటే దానికి ప్రధాన కారణం మన భారతీయుల తెలివితేటలనే చెప్పాలి.

అయితే గడిచిన కొంత కాలంగా భారతీయులకు అమెరికా ప్రభుత్వంలో ఆదరణ పెరుగుతూ వస్తోంది.

కీలక పదవులలో సైతం భారతీయులని ఎంపిక చేస్తున్నారు.గడిచిన ప్రభుత్వాలకంటే కూడా భారతీయులకు పదవులను ఇవ్వడంలో తాజాగా ఎన్నికైన బిడెన్ ముందున్నారనే చెప్పాలి.

త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న బిడెన్ మెరుగైన పాలన ప్రజలకు అందించే ప్రయత్నంలో సరికొత్త టీమ్ ని ఎంపిక చేసుకుంటున్నారు.

ఇందులో అత్యధికంగా భారతీయులకు స్థానం కల్పించారు.ఈ క్రమంలోనే అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డల్లాస్ హ్యుస్టన్ లో ఉన్న తమ శాఖనందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా భారత సంతతి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ భవేష్ పటేల్ ను నియమించింది.

"""/"/ భవేష్ పటేల్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ రసయనాల శుద్ది చేసే సంస్థ అయిన లియోండెల్ బాసెల్ ఇండస్ట్రీ కి చైర్మెన్.

ఆయన వయసు 53 ఏళ్ళు.భవేష్ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే గ్రేటర్ హ్యుస్టన్ సలహా సభ్యుడిగా కూడా పనిచేశారు.

అలాగే గతంలో చెవ్రాన్ కార్పొరేషన్ , ఆ కార్పోరేషన్ అనుభంద సంస్థల్లో కూడా ఆయన పనిచేశారు.

అయితే తాజాగా ఆయన్ను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డల్లాస్ హ్యుస్టన్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది భారతీయులు అందరికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానని భవేష్ తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‎పోర్టు వద్ద ఆపరేషన్ చిరుత సక్సెస్..!