బసవపురం మొదలైన భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర…!
TeluguStop.com
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క( CLP Leader Bhatti Vikramarka ) చేపట్టిన పీపుల్స్ మార్చ్( People's March ) పాదయాత్ర గురువారం ఉదయం భువనగిరి మండలం బసవపురం గ్రామం నుంచి ప్రారంభమైంది.
బసవపురం గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కుని కలిసి గ్రామపంచాయతీ కార్మికుల గురించి అసెంబ్లీలో కొట్లాడని వినతిపత్రం సమర్పించారు.
ఆలేరు పట్టణంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని,ఎమ్మెల్యే గొంగిడి సునీత( Gongidi Sunita ) ఒత్తిడి మేరకు అధికారులు అర్ధరాత్రి డ్రా తీసి బీఆర్ఎస్( BRS ) కార్యకర్తలకు ఇచ్చారని సమంత రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భట్టి విక్రమార్కకి మరో వినతిపత్రం అందజేశారు.
దీనిపై ఆయన స్పందిస్తూ మీ సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని,అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే శాశ్వత పరిష్కారమని అన్నారు.
పుష్ప ది రూల్ కు బాలీవుడ్ లో భారీ షాక్.. ఆ సినిమాతో పోటీ వల్ల ఇబ్బందేనా?