వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పొడిగింపు
TeluguStop.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పొడిగింపు అయింది.
బెయిల్ ను పొడిగిస్తూ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఈనెల 10వ తేదీ వరకు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు అయింది.
అయితే అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డి బెయిల్ కోరగా అనుమతించిన కోర్టు గతంలో ఆయనకు 12 రోజులపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కాగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఏప్రిల్ 16న అరెస్టు చేశారు.
హత్య అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేయడంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు అభియోగించిన సంగతి తెలిసిందే.
350 మంది అభిమానులకు లంచ్ ఏర్పాటు చేసిన సాయితేజ్.. ఈ మెగా హీరో గ్రేట్!