కోట్ల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన భాస్కర్ రావు.. మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలను చదివించడానికి తల్లీదండ్రులు అ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ప్రైవేట్ స్కూల్స్ వల్ల కొన్ని చోట్ల విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు( Government Schools ) మూతబడుతున్న సందర్భాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జిల్లా( Hanumakonda District ) నర్సింగాపూర్ లో సరైన వసతులు లేక కొన్నేళ్ల క్రితం విద్యార్థుల సంఖ్య తగ్గింది.

"""/" / ఆ సమయంలో కావేరి విత్తన సంస్థ( Kaveri Seeds ) అధినేత గుండవరపు భాస్కర్ రావు( Gundavarapu Bhaskar Rao ) ఆ స్కూల్ కోసం ప్రహరీ గోడను నిర్మించగా అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది.

తన చిన్న ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వడంతో ఆయన స్కూల్ ను దత్తత తీసుకున్నారు.

తన తల్లీదండ్రుల స్మారకార్థం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు భవనాలను నిర్మించారు.

"""/" / విశాలమైన మైదానంతో పాటు వేర్వేరు భోజనశాలలను నిర్మించారు.రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లల కోసం బస్సులను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ టీచర్లు( Government Teachers ) ఉన్నా మరో 19 మంది ప్రైవేట్ టీచర్లను ఏర్పాటు చేసి స్కూల్ ను అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 836 మంది విద్యార్థులు ఉన్నారు.

బడి బాగోగుల కోసం భాస్కర్ రావు ప్రతి నెలా 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

నా సొంత ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో బడి బాధ్యతలు అందుకున్నానని భాస్కర్ రావు తెలిపారు.

చదువు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధమేనని భాస్కర్ రావు తెలిపారు.భాస్కర్ రావు మంచి మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

భాస్కర్ రావు ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థికంగా తన వంతు సహాయం చేశారు.

ఎంతోమంది పేద విద్యార్థులను భాస్కర్ రావు ఎంబీబీఎస్, బీటెక్ చదివించారు.

వామ్మో.. భారతీయులు ఆన్లైన్లో షాపింగ్ ఇలా చేస్తున్నారా..?