భారతీ పే ' కౌంటర్ ర్యాగింగ్ మొదలెట్టిన టీడీపీ ! ?

ఏపీ అధికార పార్టీ వైసిపి టిడిపి మధ్య పోరు కాస్త ఇప్పుడు వ్యక్తిగత పోరుగా మారింది.

ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం తర్వాత టిడిపి వైసిపిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయగా, నందమూరి కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని ప్రస్తావిస్తూ వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, అలాగే విజయవాడలో చంద్రబాబు పోస్టర్లు అతికించి గతంలో ఎన్టీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పోస్టర్ల రూపంలో నగరమంతా అంటించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

దీనికి కౌంటర్ గా జగన్ భార్య వైఎస్ భారతి పోస్టర్లు కొంతమంది టిడిపి మద్దతుదారులుగా అనుమానిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు అతికించడం కలకలం సృష్టిస్తోంది.

' పే సీఎం ' పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి .40% కమిషన్ తీసుకోబడును అంటూ అందులో భారతి ఫోటోను ముద్రించి క్యూఆర్ కోడ్ స్థానంలో భారతి బొమ్మను ముద్రించారు.

' ఇక్కడ లిక్కర్ సొమ్ము తీసుకోబడును అంటూ అందులో పేర్కొన్నారు.గత కొంతకాలంగా ఏపీలో లిక్కర్ మాఫియా కు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలను వైసిపి ప్రభుత్వం ఎదుర్కొంటుంది.

ఈ క్రమంలో వైఎస్ భారతి పేరు తెరపైకి రావడంతో, ఇప్పుడు వాటిని టిడిపికి చెందిన కొంతమంది పోస్టర్ల రూపంలో ముద్రించి గోడలపై అతికించడం కలకలం రేపుతుంది.

దీనికి కౌంటర్ గా వైసిపి నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి, ఆయన కోడలు బ్రహ్మణి పైన  ఇదే స్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు.

ఇప్పటికే చంద్రబాబు పోస్టర్లకు సంబంధించి విజయవాడ నగర పోలీసులు యాక్షన్ లోకి దిగారు.

  """/"/ ఈ తరహా వ్యవహారాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరికలు చేయడంతో పాటు,  ఆ పోస్టర్లను తొలగించే పనుల్లో నిమగ్నం అవ్వగా,  ఇప్పుడు స్వయంగా సీఎం భార్య భారతి పేరుతో పోస్టర్లు వెలబడడం , దానికి కౌంటర్ గా చంద్రబాబు సతీమణిపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ వైసిపి మద్దతుదారులు సోషల్ మీడియాలో అనేక పోస్టింగ్స్ పెడుతూ,  ఈ వ్యవహారాన్ని మరింత రచ్చ చేసే పనిలో పడ్డారు.

అయితే హుందాగా రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలుచోటుచేసుకోవాల్సి ఉన్నా.  ఆ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగానుx  కుటుంబ సభ్యులను మహిళలను కించపరిచే విధంగా మారడం ఇవన్నీ ప్రస్తుత రాజకీయాల దిగజారుడు దుస్థితిని తెలియజేస్తున్నాయి.

 .

డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చావా.? పవన్ కు ముద్రగడ ప్రశ్న