పాడ్‌కాస్టర్‌గా రాణిస్తున్న భార్గవి.. ఎవరో తెలుసా..?

ఇటీవల పాడ్‌కాస్ట్‌లకు బాగా క్రేజ్ పెరిగింది.సోషల్ మీడియా( Social Media)లో వీటికి బాగా ఆదరణ లభిస్తోంది.

పాడ్‌కాస్ట్‌లు చేస్తూ చాలామంది సోషల్ మీడియాలో చాలా పేరు సంపాదించుకుంటున్నారు.స్పూర్తిదాయకమైన, ఇన్స్పిరేషన్ కలిగించే విషయాలు చెబుతూ ఎంతోమందికి మోటివేషన్ కలిగిస్తున్నారు.

అయితే పాడ్‌కాస్టర్‌గా రాణించాలనుకునేవారి కోసం సమాచారం కరువైంది.దీని కోసం బెంగళూరుకు చెందిన భార్గవి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది.

భార్గవి ప్రస్తుతం ఎక్సెల్ కార్పొరేషన్ కంపెనీకి సీఈవోగా ఉంది. """/" / మనం దేశంలో బెస్ట్ పాడ్‌కాస్టర్‌గా భార్గవి( Bhargavi ) మంచి పేరు సంపాదించుకుంది.

కంటెంట్ ప్రొడ్యూసర్ గా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.పీ ఫర్ పాడ్‌కాస్ట్ పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చింది.

దేశంలో పాడ్‌కాస్ట్‌పై తెచ్చిన తొలి పుస్తకం ఇదే కావడం గమనార్హం.బిజినెస్ పాడ్‌కాస్ట్ షో అయిన పీపుల్ హు మ్యాటర్ తో ఆమె మంచి పేరు తెచ్చుకుంది.

మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్ చేసిన భార్గవి పాడ్ కాస్టర్ అవ్వడం కోసం రీసెర్చ్ చేసింది.

ఆమె రాసిన పుస్తకానికి ఆమె తల్లి ఎడిటర్ గా వ్యవహరించింది.తల్లితో కలిసి ఈ పుస్తకాన్ని తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని భార్గవి చెబుతోంది.

"""/" / అలాగే వెబ్‌సిరీస్‌ల( Webseries ) కోసం భార్గవి ఎన్నో స్క్రిఫ్ట్‌లు రాసింది.

ఆమె రాసిన స్క్రిఫ్ట్‌లు తొలి సిటింగ్ లోనే ఓకే అయ్యాయి.తాను పాడ్ కాస్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు సమాచారం కోసం వెతికానని, కానీ ఎక్కడా దొరకలేదని చెబుతోంది.

దీంతో పాడ్‌కాస్టింగ్ కోసం వీలైనంత సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పస్తకం రాసినట్లు చెబుతోంది.

సక్సెస్‌కు షార్ట్‌కట్స్ ఉండవని, మన వృత్తిపై మనం చూపిసే ప్రేమ, ఆసక్తి, కష్టం మనల్ని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు.

సక్సెస్ కోసం ఒకరిని అనుసరించాలనే రూల్ ఏమీ లేదని అంటోంది.