‘భారతీయుడు 3’ సినిమా ఉందా? లేదా? ఉంటే ఎప్పుడు రిలీజ్ అవ్వనుంది…

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్( Shankar ) డైరెక్షన్ లో కమల్ హసన్( Kamal Haasan ) హీరోగా రీసెంట్ గా 'భారతీయుడు 2'( Bharateeyudu 2 ) సినిమా వచ్చింది.

అయితే ఈ సినిమా 1996లో వచ్చిన 'భారతీయుడు ' సినిమాకి సీక్వెల్ గా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే భారతీయుడు మొదటి పార్ట్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మాత్రం అంతటి డిజాస్టర్ ని మూటగట్టుకుంది.

ఇప్పుడు భారతీయుడు 3( Bharateeyudu 3 ) సినిమాను కూడా సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే 30% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న భారతీయుడు 3 సినిమాను తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళి భారీ రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక 2025 వ సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఇక ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు సైతం 'భారతీయుడు 2' సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు.

మళ్ళీ భారతీయుడు 3 సినిమా ఎందుకు చేయడం అంటూ శంకర్ ను ప్రశ్నిస్తున్నారు.

మరి దానికి శంకర్ ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికీ మొత్తానికైతే భారతీయుడు 3 సినిమాకు కూడా తొందరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ప్రస్తుతం కమల్ హాసన్ మణిరత్నం తో 'థగ్ లైఫ్'( Thug Life ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఇటు కమలహాసన్, అటు మణిరత్నం ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది.

70 సంవత్సరాలకు దగ్గరలో ఉన్న కమలహాసన్ ఇప్పటికి కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ తన మార్క్ ను చూపిస్తున్నాడు.

ఇక మొత్తానికైతే మరోసారి తనను తాను స్టార్ హీరోగా నిరూపించుకోవాలని చూస్తున్నాడు.

కోర్టులో హాజరు కావడానికి మేకప్‌ డిమాండ్ చేసిన లేడీ మర్డరర్‌..?