వరల్డ్ కప్ లో కొనసాగుతున్న బారత జైత్ర యాత్ర!

భారతీయులకు క్రికెట్ కు విడదీయరాని అనుబంధం ఉంటుంది.దేశంలో మరే క్రీడకు లేనంత గుర్తింపు ,ఆదరణ క్రికెట్ కి ఉంది.

దానికి తగినట్టే ప్రపంచంలో అత్యంత రిచ్చేస్ట్ లీగ్ గా ఐపిఎల్ కు గుర్తింపు ఉంది.

ఎంతో మంది మెరికలాంటి ఆటగాళ్ళు ఈ ఐపిఎల్ ద్వారా గుర్తించబడ్డారు .అయితే 2011 తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ ( ICC World Cup )భారత్ కు లేకపోవటం ఒక వెలితిగా కొనసాగుతూనే ఉంది.

జార్ఖండ్ డైనమేటే ,మిస్టర్ కూల్ ధోని తర్వాత దేశానికి వరల్డ్ కప్ అందించిన నాయకుడు లేడు.

2011 తర్వాత మరోసారి భారత్ వేదికగా వరల్డ్ కప్ నిర్వహణ జరుగుతూ ఉండడంతో మరోసారి భారత్ కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి .

దానికి తగ్గట్టుగానే భారత్ వరల్డ్ కప్ ప్రయాణం సాగుతుంది .ఇప్పటికే లీగ్ స్టేజ్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లను ఓడించిన భారత క్రికెట్ జట్టు పూణే లో గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో అన్ని రంగాలలోనూ పై చేయి సాధించి సూపర్ విక్టరీ సాధించింది.

తొలుత 256 పరుగులకు బంగ్లాదేశ్ ను కట్టడి చేసిన బారత్ కేవలం 41.

3 ఓవర్ ల లోనే లక్ష్యాన్ని ఛేదించింది .నాలుగు సంవత్సరాల తర్వాత చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) నాటకీయ పరిణామాల మధ్య సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

"""/" / సెంచరీ పూర్తి చేసుకోవడానికి మరియు మ్యాచ్ పూర్తి అవడానికి కూడా 8 రన్నులు మాత్రమే ఉండడంతో మరో ఎండ్ లో ఉన్న రాహుల్ పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి సింగిల్స్ ని తిరస్కరించడంతో విరాట్ నాలుగు సంవత్సరాల తర్వాత తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

భారత్ ఈ ఆదివారం మరో కీలక మ్యాచ్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది .

బలమైన ప్రత్యర్ధి న్యూజిలాండ్తో ఆదివారం తలపడుతుంది.వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై భారత్ కు సరైన గణాంకాలు లేకపోయినప్పటికీ స్థానిక పరిస్థితులను సద్వినియోగం చేసుకొని గెలవాలని భారత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

అయితే న్యూజిలాండ్తో మ్యాచ్ ఓడినా కూడా భారత్ సెమిస్ కి వెళ్లడానికి పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవు .

ఎందుకంటే ఇప్పటివరకు లీగ్ మ్యాచ్ లలో ఒక మ్యాచ్ కూడా బారత్ ఓడిపోలేదు కనుక అయితే విజయపరంపరను కొనసాగించాలని భావిస్తున్న బారత్ ఎట్టి పరిస్తితి లోనూ గెలవడానికి వ్యూహాలు సిద్దం చేసుకుంటుంది, అయితే భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడటం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తుంది .

పాండ్య గాయం పై ఇంకా బిసిసిఐ ఈ వివరణ ఇవ్వలేదు అయితే పాండ్య తొందరగా కోలుకొని భారత జైత్ర యాత్ర ను కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు .

జగన్ పతనాన్ని ముందే ఊహించాను… అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు!