ధోనికి భారతరత్న?

ఎంఎస్ ధోని 28 ఏళ్ల భారతీయుల కలను నిజం చేశారు.2011లో ప్రపంచ కప్ ను భారత్ కు అందించారు.

ధోని సారథ్యంలో భారత్ మెన్స్ క్రికెట్ టీం ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంది.

ధోని గురించి అతని ప్రతిభ గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుందని ఎంతోమంది క్రికెట్ లెజెండ్స్ అభిప్రాయపడ్డారు.

మరి అలాంటి ధోని వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్ మెన్ అలాగే ఏ గ్రేటెస్ట్ క్యాప్టెన్ ఫర్ ఇండియాగా ఫ్యాన్స్ కు భారత క్రికెట్ కు గుర్తుండిపోతారు.

తాజాగా ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.ధోని సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ధోనిని ఇక బ్లూ జెర్సీ లో కనిపించడని క్రికెట్ ఫ్యాన్స్ అంతా షాక్ లో ఉన్నారు.

భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన ధోనిపై ప్రముఖులందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

"""/"/ ఇలాంటి టైంలో భూపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిసి శర్మ భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన ధోనికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించాలని కోరుతున్నారు.

మరి కేంద్రప్రభుత్వం ధోనికి భారతరత్న ఇస్తారో లేదో వేచి చూద్దాం.

వైరల్ వీడియో: కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పక్కనే ఉండి..?