ఈనెల 7న భారత్ జోడో యాత్ర వార్షికోత్సవ వేడుకలు

దేశ వ్యాప్తంగా ఈనెల 7వ తేదీన భారత్ జోడో యాత్ర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

గతేడాది సెప్టెంబర్ 7న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించి దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.

భారత్ జోడో యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జోడో యాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలుస్తోంది.

ఈ మేరకు ఈనెల 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేతలు పాదయాత్రలు నిర్వహించనున్నారు.

ఈ పాదయాత్రలలో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు, ఇంఛార్జ్ లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

మన దర్శకులతో ఇతర భాషల హీరోలు సినిమాలు చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే..?