చిరంజీవి నేను గూడుపుఠాణి చెయ్యడం లేదు.. తమ్మారెడ్డి భరద్వాజ్ క్లారిటీ?

ఏపీలో గత కొద్దిరోజులుగా టికెట్ రేట్ల విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవోను జారీ చేయగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య నెలకొన్న గ్యాప్‌తో ఇష్యూ మరింత ముదిరింది.

కానీ ఏపీ మంత్రులు మాత్రం తమ నాయకుడు జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది అని అంటున్నారు.

అంతేకాకుండా హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని, అప్పుడే నిర్మాతలకు లాభం కూడా చేకూరుతుందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఏపీ సీఎం జగన్ ని మెగాస్టార్ చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే.

ఇదే విషయంపై మంచు విష్ణు స్పందిస్తూ వ్యక్తిగతంగా ప్రభుత్వంతో మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని అన్నారు.

ఈ విషయంపై సీనియర్ దర్శక నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.సినిమా టికెట్ల రేట్లు విషయంలోనే గతంలో చిరంజీవి వెళ్లి సీఎం జగన్ ను కలిసి వచ్చారని, అంతేకాకుండా రేపో ఎల్లుండో మరొకసారి కలుస్తారని తెలిపారు తమ్మారెడ్డి.

నేను చిరంజీవి గూడుపుఠాని చెయ్యట్లేదు.వెళ్లేముందు మేము ఏం విషయాలు అయితే చెప్పాలి అనుకున్నామో అలా అందరి ముందు చెబుతాం అని వెల్లడించారు.

"""/"/ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ టికెటింగ్ అలవాటు కావడంతో, ఈ విషయంపై గవర్నమెంట్, ఫిలిం ఛాంబర్ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి.

చిన్న సినిమాలకు నెంబర్ ఆఫ్ స్క్రీన్ తక్కువగా ఉంటాయి.పెద్ద సినిమాలకు స్క్రీన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తిరుమలకు వచ్చిన రెవెన్యూ వదిలిపెట్టి టాక్స్ కట్టిన ఈ విషయాన్ని చెప్పండి అని అన్నారు భరద్వాజ్.

నెంబర్ ఆఫ్ షోస్ పెంచుకుంటే నాలుగు షోలు పెద్ద సినిమాలకు, ఒక షో చిన్న సినిమాలకు పెట్టుకోవడం వల్ల చిన్న సినిమాలకు న్యాయం జరుగుతుంది అనేది సినీ పెద్దల అభిప్రాయం అని వెల్లడించారు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.

ప్రభాస్ సినిమా కోసం ఇమాన్వి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?