ఎంజీఆర్ కు జోష్యం చెప్పిన నటి భానుమతి.. ఏంటంటే..?
TeluguStop.com
అలనాటి నటి భానుమతి( Bhanumathi ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.
తెలుగులో ఫిమేల్ సూపర్ స్టార్ బిరుదు పొందిన మొట్టమొదటి హీరోయిన్ ఈమె.తెలుగులో ఫస్ట్ ఫిమేల్ డైరెక్టర్‌గా కూడా ఆమె చరిత్ర సృష్టించింది.
1953లోనే ఆమె "చండీరాణి"( Chandirani ) సినిమాని డైరెక్ట్ చేసి వావ్ అనిపించింది.
ఈ మూవీ కత్తి యుద్ధాలతో చాలామందిని ఆకట్టుకుంది.ఇందులో చండీ కత్తియుద్ధంతో పాటు పులితో ఫైట్ సీక్వెన్స్‌లు ఆడియన్స్ బాగా అలరించాయి ఈ సినిమా స్టోరీ కొత్తది కాదు కానీ దీనిని నేరేట్ చేసిన విధానం ఆడియన్స్ కు బాగా నచ్చింది.
ఆ విధంగా భానుమతి డైరెక్టర్‌గా సక్సెస్ సాధించింది. """/" /
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది.
చండీరాణి సినిమా షూటింగ్ కి ఒకరోజు దిగ్గజ తమిళ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్( Mgr ) వచ్చారు.
ఈ సినిమా చేస్తున్న సమయానికి ఆయన ఇంకా స్టార్ హీరో కాలేదు.చిన్న పాత్రలు వేసుకుంటూ ఆ కాలంలో అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
అయితే చండీరాణి షూటింగ్ కి వచ్చిన ఆయన ముందుగా ఆ మూవీ హీరో ఎన్టీఆర్‌తో కాసేపు మాట్లాడారు.
తర్వాత భానుమతి వద్దకు వెళ్లారు. """/" /
కాసేపు వాళ్లు మాట్లాడుకున్నారు.
అదే క్రమంలో భానుమతి ఎంజీఆర్ చేతిలోని గీతలు చూసి "మీకు పరిపాలకులయ్యే మహాయోగం ఉంది.
" అని జోష్యం చెప్పింది.ఆమె ఈ మాటను ఊరికే చెప్పలేదు.
అప్పటికే ఆమె జ్యోతిష్యంపై చాలా మంచి పట్టు సాధించారు.ఈ విషయం తెలియని ఎంజీఆర్ ఆమె వేళాకోళం ఆడుతుందేమో అని అనుకున్నారు.
అంతేకాకుండా చాల్లేండి మీరు మరీ సరదాగా మాట్లాడుతున్నారు అనుకుంటూ అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
కొన్ని ఏళ్లకు ఆయన నిజంగానే ప్రజలను పాలించే సీఎం స్థాయికి ఎదిగారు.తర్వాత భానుమతికి ఫోన్ చేసి "మీరు చెప్పింది నిజమైందంటే థాంక్యూ" అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
కొద్ది రోజుల తర్వాత ఆయన ఇచ్చిన ఆదేశాల వల్ల భానుమతి మద్రాసు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా నియమతులయ్యారు.
చేయి చూసి ఒకరి భవిష్యత్తు చెప్పగల ప్రతిభను, ప్రత్యేకమైన శక్తిని భానుమతి పొందడం నిజంగా ఆశ్చర్యకరం.
నటిగా మాత్రమే కాకుండా సింగర్, నిర్మాత, దర్శకుడు, సంగీత స్వరకర్త, నవలా రచయితగా భానుమతి రాణించారు.
ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు.భానుమతికి పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా లభించాయి.