వేషం కోసం వచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్న కోడి రామకృష్ణ..?
TeluguStop.com
కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ స్టార్ డైరెక్టర్ "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" సినిమాతో దర్శకుడిగా మారారు.
కోడి రామకృష్ణ తన సూపర్ నేచురల్ ఫాంటసీ ఫిలిమ్స్( Natural Fantasy Films ) ద్వారా సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ పరిచయం చేశారు.
కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ ఏంటో తెలుసుకోవడానికి ఒక్క "అమ్మోరు" సినిమా చాలు.
దేవి, దేవీ పుత్రుడు, అరుంధతి వంటి సూపర్ నేచురల్ సినిమాలు కూడా ఆయన కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచాయి.
కోడి రామకృష్ణ 2019, ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో మరణించారు.బతికున్న సమయంలో కోడి రామకృష్ణ, భానుచందర్( Bhanuchander ) ఇద్దరు కలిసి పలు సినిమాలు తీశారు.
వారి కాంబినేషన్‌లో వచ్చిన "ముక్కుపుడక" సినిమా( "Mukkupudaka" Movie ) సూపర్ హిట్ అయింది.
వీళ్లు తరంగిణి (1982) మూవీలో కూడా నటించారు.అయితే ఇటీవల భానుచందర్ ఒక ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ భార్య, పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
"""/" /
ఆయన మాట్లాడుతూ "తరంగణి సినిమా షూట్ చేస్తున్నప్పుడు పద్మ అనే ఒక అమ్మాయి వేషం కోసం వచ్చింది.
అప్పటికే నాకు, కోడి రామకృష్ణకి మంచి స్నేహం ఏర్పడింది.అందుకే ఆయన నన్ను దగ్గరికి పిలిచి 'చూడు ఆ అమ్మాయి ఎలా ఉందో' అంటూ పద్మని( Padma ) చూపించారు.
నేను చూసి ఆ అమ్మాయి చాలా చక్కగా, అందంగా ఉందని చెప్పాను.సినిమాలోని పాత్రకు అద్భుతంగా సెట్ అవుతుందన్నాను.
అయితే అతను 'ఆమె పాత్ర కోసం రాలేదు, తనని నేను పెళ్లి చేసుకోబోతున్నాన'ని అన్నాడు.
దాంతో నేను పొట్టోడివైనా గట్టోడివయ్యా నువ్వు.నీది చాలా మంచి టేస్ట్, అందమైన అమ్మాయిని పట్టావు.
గద్ద వచ్చి ఏ జిలేబినో తన్నుకు పోయినట్లు ఈ అమ్మాయిని వేరే వాళ్ళు తన్నుకుపోక ముందే నువ్వు తన్నుకో' అని చెప్పాను.
" అని అన్నారు. """/" /
భానుచందర్ భార్య పేరు పద్మ.
ఆమె గురించి భానుచందర్, కోడి రామకృష్ణ మధ్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగిందా అని చాలామంది నవ్వుకుంటున్నారు.
ఆయన పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి "నేను మీకు బాగా కావాల్సినవాడిని (2022)"తో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది.
ఈమె తర్వాత కోడి ఫ్యామిలీ నుంచి పెద్దగా సినిమా ఇండస్ట్రీలో ఎవరూ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.
పొరపాటున కాకితో పెట్టుకున్నారో.. 17 ఏళ్లు నరకమే.. ఎందుకంటే..