బండిని “భజన రాజకీయం” దెబ్బ తీస్తోందా ?

తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్( Telangana BJP Chief Bandi Sanjay ) గురించి అందరికీ తెలిసిందే.

మత ప్రతిపాధికన ఘాటైన విమర్శలు, ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు, బిజెపి ( TS-BJP )అధిష్టానంపై ఎనలేని పొగడ్తలు.

ఇలా ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటాయి.

ఇక తెలంగాణలో బిజెపి ఈ స్థాయిలో బలం పెంచుకోవడానికి ఒక రకంగా బండి నాయకత్వమే అనేది ఆ బిజెపి పెద్దల అభిప్రాయం.

అయితే బండి సంజయ్ ఆయా సందర్భాల్లో ఆయన వైఖరి, చేసే బీజేపీని అంతే స్థాయిలో ఇరుకున పెడుతూ ఉంటాయి.

"""/" / ఆ మద్య అమిత్ షా( Amit Shah ) కు చెప్పులు తొడిగి తీవ్ర విమర్శల పాలు అయ్యారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రపాదాల వద్ద ఉంచడాని ప్రజలు తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఇక సమయం దొరికినప్పుడల్లా కేంద్ర పెద్దలపై మితిమీరిన పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు బండి సంజయ్.

దీంతో బండి సంజయ్ భజనపరుడని, కేవలం తన స్వార్థం కోసమే ఆశించే వ్యక్తి అని, అసలైన నాయకుడు కాదనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.

దీంతో బండి భజన రాజకీయాన్ని గమనించిన బీజేపీ పెద్దలు కూడా విసుగు చెందినట్లుగా తెలుస్తోంది.

అందుకే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకే బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

"""/" / అయితే గత కొన్నాళ్లుగా బండి సంజయ్ ని అద్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే వార్తలు వస్తున్నప్పటికి, ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు కమలనాథులు.

కానీ ఎన్నికల టైమ్ లో బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు పార్టీ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అందుకే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో అధిస్థానం కసరత్తు చేస్తోందట.

ఇప్పటికే ఈటెల రాజేంద్ర( Etela Rajendra ) పేరు గట్టిగా వినిపిస్తున్నప్పటికి ఇప్పుడు కొత్తగా డీకే అరుణ పేరు తరచూ తెరపైకి వస్తోంది.

ఆమె ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షురాలు గా ఉన్నారు.ఈమెకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించి బండి సంజయ్ ని కేవలం ప్రచారకర్త గానే యూస్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోందట అధిష్టానం.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని బండి సంజయ్ చేసే " భజన రాజకీయమే " ఆయనను దెబ్బ తీస్తోందనేది కొందరి అభిప్రాయం.

దర్శన్ ఎప్పటికీ నా కొడుకులాంటి వాడే.. సుమలత సంచలన వ్యాఖ్యలు వైరల్!