దళితులు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ: న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: సమాజంలో దళితులు, బలహీన వర్గాల హక్కుల కోసం, వారి జీవితాల్లో మార్పు కోసం భాగ్యోదయం భాగ్యరెడ్డి వర్మ పోరాడారని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో భాగ్య రెడ్డి వర్మ జయంతినీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ.

సమాజంలోని జోగిని, దేవదాసి, బస్విని వ్యవస్థను వ్యతిరేకిస్తూ, తిరుగు బాటు చేసి, దళితులు, అణగారిన వర్గాల ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు భాగ్యరెడ్డి వర్మ కృషి చేశాడని అన్నారు.

దళిత బాలికలను చదివించేందుకు 26 పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు.మూఢాచారాలు, సారా నిషేధంపై ఉద్యమం చేశాడన్నారు.

ఇలాంటి గొప్ప సంఘసంస్కర్త భాగ్య రెడ్డి వర్మ గురించి ప్రజలందరికీ తెలిసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పండగగా నిర్వహిస్తుందన్నారు.

ఇలాంటి కార్యక్రమాల వల్ల భాగ్యరెడ్డి వర్మ గొప్పదనం నేటి తరానికి తెలిసే అవకాశం ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.స్వాతంత్య్రానికి ముందే అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త వ్యక్తి భాగ్య రెడ్డి వర్మ అని అన్నారు.

సోషల్ ఆక్టివిస్ట్ గా విద్య కోసం, లింగ సమానత్వం కోసం కృషి చేశారని అన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రభుత్వం వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పండగగా ప్రకటించి పండగ వాతావరణం లో నిర్వహిస్తుందని అన్నారు.

తద్వారా వచ్చే తరాలకు, యంగ్ జనరేషన్ ఆయన గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.

జిల్లా యంత్రాంగం భాగ్య రెడ్డి వర్మ స్ఫూర్తి తో జిల్లాలో సోషల్ జస్టిస్ కోసం కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, కోనారావుపేట పాక్స్ చైర్మన్ జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ,జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేంద్ర, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, ఎస్సీ కార్పొరేషన్ ఈడి వినోద్ సిరిసిల్ల,ఇల్లంతకుంట సింగిల్ విండో అధ్యక్షులు బండ నర్సయ్య, బండి దేవదాస్,రొండ్ల తిరుపతి రెడ్డి, డైరెక్టర్ శ్రీధర్ రావు ,ఎ ఎం సి డైరెక్టర్ పాషాఖాన్, తదితరులు పాల్గొన్నారు.

ఉదయం పూట ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?