భగవంత్‌ మాన్‌తో పంజాబీ సంతతి ఎంపీ తన్మన్‌జిత్ భేటీ .. బీజేపీ విమర్శలు, ఆప్ కౌంటర్

గత వారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో భారత సంతతికి చెందిన యూకే ఎంపీ తన్మన్‌జిత్ సింగ్ ధేసీ సమావేశం కావడంపై విమర్శలు చేసిన బీజేపీపై ఆప్‌ విరుచుకుపడింది.

దీనికి కౌంటర్‌గా కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, సోమ్ ప్రకాష్‌లు సహా పలువురు బీజేపీ నేతలతో తన్మన్‌జిత్ భేటీ అయిన ఫోటోలను విడుదల చేశారు ఆప్ నేతలు.

అలాగే మాజీ కేంద్ర మంత్రి విజయ్ సంప్లా, బీజేపీకి సన్నిహితుడైన పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ , మాజీ సీఎం అమరీందర్ సింగ్‌లు ధేసీని కలిసిన ఫోటోలను కూడా విడుదల చేశారు.

కాగా.పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌‌తో తన్మన్‌జిత్ సింగ్ భేటీకి సంబంధించి గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

వేర్పాటువాదులకు అనుకూలంగా.భారత వ్యతిరేక అభిప్రాయాలను ధేసీ సమర్ధిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

దీనిపై అప్ అధికార ప్రతినిధులు నీల్ గార్గ్, మల్వీందర్ సింగ్ కాంగ్, జీవన్ జ్యోత్ కౌర్‌లు బీజేపీపై ధ్వజమెత్తారు.

ఆ పార్టీ నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఫైరయ్యారు.అయితే ఈ ఆరోపణలను తన్మన్‌జిత్ తీవ్రంగా ఖండించారు.

రైతుల హక్కుల కోసం పోరాడినందున తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.శ్రీలంకలోని హిందువులు, క్రైస్తవులు, కాశ్మీరీలు, పాలస్తీనియన్లతో సహా ప్రపంచవ్యాప్తంగా అట్టడుగున వున్న వర్గాల కోసం తాను మాట్లాడానని తన్మన్‌జిత్ గుర్తుచేశారు.

"""/"/ ఇకపోతే.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్ధతు పలికిన భారత సంతతి బ్రిటీష్ ఎంపీ తన్మన్ జిత్ సింగ్ ధేసీ ఇండియా పర్యటనలో విచిత్ర పరిస్ధితులు ఎదురవుతున్నాయి.

రైతులు, రైతు సంఘాలు ఆయనను సత్కరిస్తుంటే.పంజాబ్ బీజేపీ శాఖ మాత్రం తన్మన్‌ను ఖలిస్తాన్ మద్ధతుదారుడిగా ఆరోపిస్తోంది.

అటు ఇంటర్నేషనల్ యాంటీ ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఫ్రంట్ సైతం ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

అంతేకాదు.భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను తన్మన్‌జిత్ సింగ్ ధేసీ ఓసీఐ కార్డును రద్దు చేయాలని కపుర్తలా డిప్యూటీ కమీషనర్‌ను విజ్ఞప్తి చేసింది.

సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకపోతే ఏం చేసేవాడో తెలుసా..?