కెనడాకు నేరుగా ఫ్లైట్స్.. అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అడ్డుపడొద్దు: భగవంత్ మాన్‌కి స్థానికుల వినతి

కెనడాకు నేరుగా ఫ్లైట్స్ అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అడ్డుపడొద్దు: భగవంత్ మాన్‌కి స్థానికుల వినతి

పంజాబ్‌లోని మొహాలీ విమానాశ్రయం నుంచి కెనడా, యూకే, ఆస్ట్రేలియా, యూఎస్‌లకు నేరుగా విమానాలను ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఒప్పించాలని రాష్ట్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు సీఎం భగవంత్ మాన్ జారీ చేసిన ఆదేశాలపై అమృత్‌సర్‌లోని స్థానికులు, ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కెనడాకు నేరుగా ఫ్లైట్స్ అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అడ్డుపడొద్దు: భగవంత్ మాన్‌కి స్థానికుల వినతి

సీఎం వైఖరి నగరంలోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిని, భవిష్యత్తును విస్మరించేలా వుందని వారు మండిపడ్డారు.

కెనడాకు నేరుగా ఫ్లైట్స్ అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అడ్డుపడొద్దు: భగవంత్ మాన్‌కి స్థానికుల వినతి

అమృత్‌సర్- టొరంటో, అమృత్‌సర్- వాంకోవర్ డైరెక్ట్ ఫ్లైట్స్‌ను ప్రారంభించడానికి చేస్తున్న ప్రణాళికలను తొక్కిపెట్టేలా సీఎం సూచనలు వున్నాయని కుల్వంత్ సింగ్ అనే స్థానికుడు ఆరోపించాడు.

పంజాబీ మూలాలున్న కెనడియన్ పౌరుడైన థంజు .అమృత్‌సర్- కెనడా డైరెక్ట్ ఫ్లైట్‌లను ప్రారంభించాలని ఇటీవల కెనడా పార్లమెంట్‌ను కోరాడు.

దీనికి అక్కడి ప్రభుత్వం నుంచి మంచి స్పందన సైతం వచ్చింది.పంజాబీ మూలాలున్న 20,000కు పైగా కెనడియన్ పౌరులు ఆయన వేసిన పిటిషన్‌కు అనుకూలంగా సంతకాలు చేశారు.

దీనిపై కెనడా పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా.ఎంపీ రూబీ సహోటా, బ్రాడ్ విస్‌లు మాట్లాడారు.

అమృత్‌సర్- టొరంటో, అమృత్‌సర్- వాంకోవర్‌లకు డైరెక్ట్ ఫ్లైట్స్‌ను ప్రారంభించాలనే పిటిషనర్ వాదనకు అనుకూలంగా వాదించారు.

"""/" / కొద్దిరోజుల క్రితం భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కెనడా పర్యటన సందర్భంగా ఆ దేశ విమానయాన శాఖ మంత్రి ఒమర్ అల్గాబ్రాను కలిశారు.

ఈ సందర్భంగా అమృత్‌సర్- టొరంటో, అమృత్‌సర్- వాంకోవర్‌లకు డైరెక్ట్ ఫ్లైట్‌ల విషయమై వీరిద్దరూ చర్చలు జరిపారు.

అటువంటి అనుకూలమైన పరిస్ధితి ఏర్పడిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చర్యలు అమృత్‌సర్ విమానాశ్రయ వృద్ధి అవకాశాలకు విరుద్ధంగా వున్నాయని అమృత్‌సర్ వికాస్ మంచ్‌ నేత, విమానయాన నిపుణుడు మన్మోహన్ సింగ్ బ్రార్ మండిపడ్డారు.

"""/" / అమృత్‌సర్ విమానాశ్రయంలో 12,000 అడుగుల పొడవైన రన్ వే వుందని.

ఇది మొహాలీ ఎయిర్‌పోర్ట్‌‌ కంటే పొడవైనదని ఆయన అన్నారు.అలాగే అమృత్‌సర్‌లో CAT 3-b ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో వుందని బ్రార్ చెప్పారు.

ఇది దట్టమైన పొగమంచు ఏర్పడిన సమయాల్లో విమానాలను సేఫ్‌గా ల్యాండింగ్ చేయడానికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.

మరోవైపు.మొహాలీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా అర్హత లేదు.

అంతేకాదు ఇది రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్‌పోర్టు.అందువల్ల ఇక్కడ చాలా పరిమితులు వుంటాయి.

కానీ అమృత్‌సర్‌ విమానాశ్రయం పౌర విమానాశ్రయం.ఇది దాదాపు 1,200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది.

అమృత్‌సర్ విమానాశ్రయం అభివృద్ధికి కృషి చేసేందుకు సీఎం భగవంత్ మాన్‌ను ఒప్పించాల్సిందిగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులను స్థానికులు కోరారు.

వైరల్ వీడియో: లిఫ్ట్‌లో ఊహించని ప్రమాదం.. బాలుడి ధైర్యానికి ప్రశంసలు!