బ్రేక్ ఈవెన్ మార్కు కి అతి చేరువలో ‘భగవంత్ కేసరి’..9 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

ఈ దసరా కానుకగా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరో గా నటించిన 'భగవంత్ కేసరి'( Bhagwant Kesari ) చిత్రం విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

సినిమా విడుదల రోజు వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను దక్కించుకొని సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది.

కుటుంబ నేపథ్యం ఉన్న సినిమా కావడం , దానికి తోడు చిత్రం లో ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా పండడం వల్ల కమర్షియల్ గా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి.

బాలయ్య ఇమేజి కి తోడు ఫ్యామిలీ ఆడియన్స్ లో అనిల్ రావిపూడి కి ఉన్న ఇమేజి కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది.

"""/" / ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ( Pre-release Theatrical Business )దాదాపుగా 67 కోట్ల రూపాయలకు జరిగింది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 9 రోజుల్లో దాదాపుగా 58 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది.

అంటే దాదాపుగా 90 శాతం రికవరీ అన్నమాట.సాధారణంగా 'దసరా' ( Dussehra )పూర్తైన తర్వాత సినిమాలు చాలా డల్ గా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు.

కానీ 'భగవంత్ కేసరి' మాత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టించింది.

మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇది ఈ ఏడాది నాన్ స్టాప్ గా వారం రోజులకు పైగా షేర్ వసూళ్లు సాధించిన రెండు మూడు చిత్రాలలో ఒకటిగా నిల్చింది.

ఈ స్థాయి వసూళ్లు నిర్మాతలు కూడా ఊహించలేదు. """/" / ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కేవలం 10 కోట్ల రూపాయిల దూరం మాత్రమే ఉంది.

ఈ వీకెండ్ లో కనీసం మూడు కోట్ల రూపాయిలు అయినా రికవర్ చేస్తుందని, వచ్చే వారం లో నూటికి నూరు శాతం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ చిత్రం తో బాలయ్య చాలా కాలం తర్వాత హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత ఆయన 'వాల్తేరు వీరయ్య' డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ చిత్రం తో ఆయన తన విజయయాత్ర ని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.

ఆ ఫోటో వల్ల నేనే అనసూయ భర్తను అనుకున్నారు.. సాయి రాజేష్ కామెంట్స్ వైరల్!