దసరా బరిలో నెగ్గిందెవరు.. ఆశ్చర్యం అనిపించినా జరిగింది ఇదే!

దసరా సీజన్ లో కూడా మన టాలీవుడ్ లో ప్రతీ ఏడాది భారీ పోటీ ఉంటుంది.

అలాగే ఈ ఏడాది కూడా పోటీ ఆసక్తికరంగా ఉంది.ఈసారి స్టార్ హీరోలు బరిలోకి దిగారు.

ముగ్గురు కూడా స్టార్ హీరోలే కావడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.మూడు సినిమాలు ముందు నుండి అనుకున్న విధంగానే భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి.

అలాగే రిలీజ్ అయ్యి ఫస్ట్ వీకెండ్ కూడా ముగిసింది.మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? దసరా బరిలో నెగ్గింది ఎవరు? తగ్గింది ఎవరు అనేది తెలుసుకుందాం.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను బట్టి ఎవరు పైచేయి సాదించారంటే. """/" / ఈ దసరా బరిలో నందమూరి బాలకృష్ణ( Balakrishna )మాస్ రాజా రవితేజ( Ravi Teja ) తో పాటు కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ తలపతి కూడా బరిలోకి దిగాడు.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) తెరకెక్కగా ఇది అక్టోబర్ 19న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

ఇక అదే రోజు బాలయ్యకు పోటీగా విజయ్ లియో సినిమాతో వచ్చాడు.ఇది టాక్ బాగా రాకపోయినా కలెక్షన్స్ తో కుమ్మేస్తున్నాడు.

అలాగే మాస్ రాజా రవితేజ వంశీ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీటైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) తో ఒకరోజు లేటుగా అంటే అక్టోబర్ 20న బరిలోకి దిగాడు.

ఇది మిశ్రమ స్పందన తెచ్చుకుంది.మరి ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వచ్చిన సినిమా ఏది అంటే లియో.

( LEO ) కొద్దిగా ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం.టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా తెలుగులో 17 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి ఇప్పటికే 15.

50 కోట్లు రాబట్టింది.అలాగే వరల్డ్ వైడ్ గా 400 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది.

"""/" / ఇక భగవంత్ కేసరి కూడా మంచి వసూళ్లనే రాబడుతుంది.ఇప్పటికే 80 కోట్ల గ్రాస్ వరకు రాబట్టిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 20 కోట్లకు పైగానే రాబట్టాలి.

మరో రెండు మూడు రోజులు సెలవలు ఉండడమే కాకుండా నెక్స్ట్ వీకెండ్ కూడా కొత్త సినిమాలు లేకపోవడంతో సేఫ్ జోన్ లోకి రావడం ఖాయం.

మరి టైగర్( ( Tiger Nageswara Rao ) ) పరిస్థితి మాత్రం ఏమీ బాలేదు.

ఈ సినిమా కేవలం 13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.మరో 25 కోట్లు వసూళ్లు చేస్తే తప్ప బయటపడేలా లేదు.

ఈ లెక్కన టైగర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ నుండి బయట పడే అవకాశం చాలా తక్కువ.

ఈ మూడు సినిమాల్లో చూసుకుంటే లియో పైచేయి సాధించింది.అయితే తెలుగులో మాత్రం రవితేజ కంటే బాలయ్య ముందు ఉన్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 3, ఆదివారం 2024