భగవంత్ కేసరి వాయిదా వేస్తున్నారా..?

నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న రిలీజ్ ఫిక్స్ చేశారు.

దసరా కానుకగా బాలయ్య సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ఆల్రెడీ ఈ ఇయర్ సంక్రాంతికి వీర సింహా రెడ్డి( Veera Simha Reddy ) తో వచ్చిన బాలకృష్ణ దసరాకి భగవంత్ కేసరి తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.

ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకస్ సైలెంట్ గా ఉన్నారు.అయితే అక్టోబర్ 19 రిలీజ్ దాదాపు కన్ ఫర్మ్ అయినా పోటీగా రెండు మూడు సినిమాలు వస్తున్నాయి కాబట్టి రిలీజ్ గురించి మళ్లీ ఆలోచనలో పడ్డారట.

"""/" / భగవంత్ కేసరి సినిమాను అనీల్ రావిపుడి( Anil Ravipudi ) చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కించాడు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల నటిస్తున్నారు.భగవంత్ కేసరి దసరాకి రిలీజ్ ఫిక్స్ చేసుకోగా రిలీజ్ డేట్ లో మార్పు ఉండే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు.

ఈ సిఒనిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే మేకర్స్ మరోసారి అప్డేట్ ఇవ్వాల్సిందే అని చెప్పొచ్చు.

ఆ ఇద్దరి స్టార్ హీరోలతో చేసిన స్నేహమే కొరటాల శివ తలరాతను మార్చేసిందా..?