నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ అప్పటి నుండే?
TeluguStop.com
నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandmuri Balakrishna ) హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''భగవంత్ కేసరి''.
ఈ సినిమా కోసం నందమూరి ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ అనేది వదలలేదు.
దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. """/" /
ఇటీవల జూన్ లో బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్( Bhagavanth Kesari Teaser ) రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఈ టీజర్ తర్వాత మరొక అప్డేట్ అయితే రాలేదు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నారట.
ఇప్పటికే షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.దీంతో ప్రమోషన్స్ కోసం టైం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
తాజా బజ్ ప్రకారం ఆగస్టు మూడవ వారం నుండి ఈ సినిమా వరుస అప్డేట్ రానున్నట్టు తెలుస్తుంది.
దీంతో భగవంత్ కేసరి మేనియాకు సమయం ఆసన్నం అవుతుంది.ఇది నిజంగా నందమూరి అభిమానులకు( Nandamuri Fans ) పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
చూడాలి ఈ ప్రమోషన్స్ ఎప్పుడు దేనితో స్టార్ట్ చేస్తారో.కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
"""/" /
ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్( Bollywood Actor Arjun Rampal ) నటిస్తున్నాడు.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే.
ఫేక్ న్యూస్ తో ఫేమస్ అయిన మీనాక్షి చౌదరి… ఆ వార్తలలో నిజం లేదా?