Bhagavanth Kesari: భగవంత్ కేసరి సినిమాలో ఈ తప్పును గమనించారా.. అనిల్ రావిపూడి క్షమాపణలు చెప్పడంతో?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా నటించిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య బాబు.గత రెండు సినిమాలు అయిన అఖండ, వీరసింహ రెడ్డి లాంటి సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.

ఇప్పుడు మూడో సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో బాలయ్య బాబు( Balakrishna ) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

ఇందులో బాలయ్య, శ్రీలీల యాక్టింగ్ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. """/" / ఈ క్రమంలోనే తొలిరోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.30 కోట్లకు పైనే గ్రాస్ ను వసూలు చేసింది.

దీంతో శుక్రవారం భగవంత్ కేసరి సక్సెస్ మీట్ పెట్టారు.ఇందులోనే భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) మాట్లాడుతూ సారీ చెప్పారు.

అయితే అనిల్ రావిపూడి ఎందుకు స్వారీ చెప్పాడు అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.

భగవంత్ కేసరి సినిమాలో పోలీస్ అధికారి, ఖైదీ పాత్రల్లో బాలయ్య కనిపించాడు.అతడి పెంపుడు కూతురిగా శ్రీలీల( Sreeleela ) నటించింది.

గత సినిమాలతో పోలిస్తే శ్రీలీల ఇందులో సెటిల్డ్‌గా యాక్ట్ చేసింది.ఎమోషన్స్ సీన్స్‌తో పాటు క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్స్ కూడా చేసి ఆశ్చర్యపరిచింది.

"""/" / అయితే ఇందులో శ్రీలీల పోషించిన విజ్జి పాత్ర తండ్రిగా శరత్ కుమార్( Sarath Kumar ) కాసేపు కనిపించారు.

జైలర్‌ రోల్ చేశారు.కానీ ఆయన చనిపోయారని టీవీలో చెప్పినప్పుడు సీఐ అని స్క్రోలింగ్ వేస్తారు.

తాజాగా ఇదే విషయాన్ని ఒక రిపోర్టర్ అనిల్ రావిపూడిని అడిగారు.పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం.

మీ సునిశీత పరిశీలన, సూక్ష‍్మ బుద్దికి హ్యాట్సాఫ్.జైలర్‌ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పే.

మా వాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు.అందుకు క్షమాపణలు అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

నాకు సమయం వస్తుంది…. అప్పుడే సమాధానం చెబుతా… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!