పెద్దయ్యాక నేను సమంత అవుతాను.. భగవంత్ కేసరి చిన్నారి ఊహ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
భగవంత్ కేసరి సినిమాలో ఇద్దరు చిన్నారులు( Bhagavanth Kesari ) నటించిన సంగతి తెలిసిందే.
విజ్జిపాప చిన్నప్పటి పాత్రలో నైనిక నటించగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ లో ఊహ అనే చిన్నారి నటించారు.
భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో భాగంగా చిన్నారి ఊహ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఊహ మాట్లాడుతూ హాయ్ అందరికీ నమస్తే అంటూ క్యూట్ గా చెప్పుకొచ్చారు. """/" /
మా డైరెక్టర్ సార్ కు నమస్తే.
అందరికీ నమస్తే.నాతోని బాలకృష్ణ( Balakrishna ) మంచిగా ఉన్నారు.
షూటింగ్ దగ్గర నాతోని మంచిగా మాట్లాడుతూ ఉన్నారు.మంచిమంచిగా ఆడుకున్నారు.
శ్రీలీల ఐ లవ్ యూ అని ఊహ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత అనిల్ రావిపూడి స్టేజ్ పైకి వచ్చి ఈ పిల్లలు ఇద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారని మధ్యలో ఐదుసార్లు అటూఇటూ సిటీ బస్ లా తిరిగారని అనిల్ రావిపూడి అన్నారు.
"""/" /
తిరుగుతూ మమ్మల్ని స్టేజ్ ఎక్కించాలని అడిగారని ఊహ నా జుట్టు పట్టుకుని లాగి నన్ను ఎక్కించవా స్టేజ్ అంటూ బుంగమూతి పెట్టాను అంటూ మూతి తిప్పుకుందని అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కామెంట్లు చేశారు.
ఆ తర్వాత ఊహ బుంగమూతి పెట్టి చూపించడం గమనార్హం.ఆ తర్వాత ఊహ నేను పెద్దయ్యాక సమంత అవుతానని అన్నారు.
చిన్నారి ఊహ చెప్పిన క్యూట్ మాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.భగవంత్ కేసరి బాక్సాఫీస్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.
ఈరోజు కలెక్షన్లతో ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల గ్రాస్ దాటే ఛాన్స్ ఉంది.
థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం ఈ సినిమాకు కలిసొస్తోంది.భగవంత్ కేసరి కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అటు బాలయ్య ఇటు అనిల్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలవడం గమనార్హం.
దారుణం: గ్రైండర్‌లో చొక్కా ఇరుక్కుపోవడంతో 19 ఏళ్ల యువకుడు మృతి!