3వ వారంలో అడుగుపెట్టిన ‘భగవంత్ కేసరి’.. టోటల్ వసూళ్లు ఇవే!

దసరా ( Dussehra ) సీజన్ లో బరిలోకి దిగిన సినిమాల్లో భగవంత్ కేసరి ఒకటి.

మూడు సినిమాలు బరిలోకి దిగగా అందులో ఇది ఒకటి.వరుస సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య ( Nandamuri Balakrishna ) మళ్ళీ బరిలోకి దిగి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''భగవంత్ కేసరి''( Bhagavanth Kesari ).

ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ బాగా ఎదురు చూసారు.మరి అనుకున్నట్టుగానే అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమా మొదటి రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

"""/" / అయితే రెండవ వారం వీక్ డేస్ కావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయి మొదటి వారం కంటే తక్కువుగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా మూడవ వారంలో అడుగు పెట్టింది.దీంతో మేకర్స్ అఫిషియల్ గా ఇప్పటి వరకు ఎంత రాబట్టింది అనేది పోస్టర్ ద్వారా తెలిపారు.

"""/" / ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 135.73 కోట్ల రూపాయలను రాబట్టింది అని తెలిపారు.

చూడాలి వీకెండ్ లో ఏమైనా పుంజుకుంటుందో లేదో.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) నటించగా కూతురు రోల్ లో శ్రీలీల,( Sreeleela ) విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్( Arjun Rampal ) నటించారు.

ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

పుష్ప 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ…. షూటింగ్  ప్రారంభమయ్యేది అప్పుడేనా?