భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో అపశృతి నెలకొంది.
మెచ్చాతో పాటు ప్రచారంలో పాల్గొన్న నేత గన్నే రమేశ్ ప్రచార రథంపై గుండెపోటుతో మరణించారు.
మల్లాయిగూడెంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుంది.కాగా మృతుడు మల్లాయిగూడెం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
అయితే గన్నే రమేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మరోవైపు బీఆర్ఎస్ నేత రమేశ్ హఠాన్మరణంపై ఎమ్మెల్యే మెచ్చా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆయన మృతి పార్టీకి తీరని లోటన్న ఎమ్మెల్యే మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అయ్యయ్యో.. అలా పొగిడాడో లేడో.. ఇలా పడిపోయిన మహిళా బైకర్ (వీడియో)