తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఇప్పటికే రెండు ప్రోమోలు విడుదల అయ్యాయి.భారీ అంచనాల నడుమ ఈ సీజన్ ప్రసారం కాబోతుంది.
అయితే ఎప్పుడు ఈ షో మా టీవీలో ప్రసారం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మా వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 29న షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
మొదటి ఎపిసోడ్ ను ప్రసారం చేయబోతున్నారట.ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
నాగార్జున బర్త్ డే కారణంగా ఈనెల 29న షురూ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో షో నిర్వాహకులు ఉన్నారట.
భారీ ఎత్తున షో కు టీఆర్పీ రేటింగ్ ను రప్పించేందుకు కొత్తగా షో ను డిజైన్ చేస్తున్నారు.
కరోనా కారణంగా షో కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టకునే విధంగా షో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.నాగార్జున పుట్టిన రోజు ఈ షో ప్రారంభంకు మంచి రోజు అంటూ నిర్వాహకులు భావించారట.
అందుకే ఆ తేదీని ఖరారు చేశారు. """/"/
సీజన్ 3 లో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా ఒక కపుల్ ఉండబోతున్నారట.
ఆ కపుల్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.ఇక సింగర్ మంగ్లీ సీనియర్ నటి సురేఖ వాణి బుల్లి తెర నటీ నటులు కొందరు యూట్యూబ్ స్టార్స్ మరి కొందరు ఈ షో లో సందడి చేయబోతున్నారు.
ఎప్పటిలాగే ఈ సారి కూడా షో వంద రోజులకి పైగా కొనసాగుతుందని చెబుతున్నారు.
ఓరి దేవుడా.. 8 కేజీల బిర్యానీ ఎలా తినేశావేంటి సామీ! వీడియో వైరల్