జాగ్రత్త! యూట్యూబ్ పేరుతో ఈ-మెయిల్ స్కామ్ జరుగుతోంది!

రోజురోజుకీ డిజిటల్ స్కామ్స్ మితిమీరిపోతున్నాయి.సైబర్ నేరస్తులు( Cyber ​​criminals ) టెక్నాలజీని ఆసరాగా వాడుకొని భారీ దొంగతనాలకు పాల్పడుతున్నారు.

అభం శుభం తెలియని అమాయక జనాలను దోచేస్తున్నారు.జనాలు ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్లు వాడడంతో దాన్నే వారు క్యాష్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో స్కామర్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసగిస్తున్నారు.స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక వీడియో స్ట్రీమింగ్ యాప్, పోర్టల్ యూట్యూబ్ వాడకం అనేది గణనీయంగా పెరిగింది.

దీంతో దీన్ని కూడా స్కామర్లు మోసాలకు వాడేసుకుంటున్నారు. """/" / ఈ నేపథ్యంలో యూట్యూబ్( Youtube ) పేరుతో మెయిల్స్ పంపిస్తూ ప్రజలను మోసగిస్తున్న కొత్త ఫిషింగ్ అటాక్ గురించి కంపెనీ వినియోగదారులను తాజాగా హెచ్చరించింది.

ఇటీవల చాలా మందికి ఫేక్ యూట్యూబ్ ఇమెయిల్ ఐడీ( YouTube Email Id ) నుంచి స్కామ్ మెయిల్స్ వస్తున్నాయి.

No-reply@youtube!--com ఐడీ నుంచి కొందరికి స్కామ్ మెయిల్స్ వెళ్తున్నాయి.అయితే ఇది ఫిషింగ్ అటాక్ అని యూట్యూబ్ చెప్పడం గమనార్హం.

ఈ ఫేక్ మెయిల్స్‌పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. """/" / సదరు ఇమెయిల్ ఐడితో ఎవ్వరూ మీకు మెయిల్ చేసినా ఇచ్చిన లింక్స్‌పై క్లిక్ చేయవద్దని, అలాగే మెయిల్‌లో కనిపించే అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని వినియోగదారులను ఈ సందర్భంగా హెచ్చరించింది.

వారు నకిలీ ఇమెయిల్‌ను పంపుతూ యూజర్ల కాన్ఫిడెన్షియల్ డేటాను దొంగిలించడం, డివైజ్‌లను హ్యాక్ చేయడం, అదేవిధంగా వారి అకౌంట్ల నుంచి డబ్బు దొంగిలించడం వంటివి చేస్తున్నారు.

అంతేకాకుండా పర్సనల్ డేటాను యాక్సెస్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం.వంటివి చేస్తున్నారు.

ఈ మోసాలనే ఫిషింగ్ అటాక్ అని అంటారు.ఈ పని చేసే వ్యక్తులు ఫేక్ ఇమెయిల్స్ పంపడానికి అధునాతన మార్గాలను ఉపయోగిస్తున్నారని, వారి ట్రాప్‌లో పడకుండా ఉండాలంటే కంటెంట్, మెయిల్ పంపినవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని య్యూట్యూబ్ హెచ్చరిస్తోంది.

ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కథ ఇదేనా..?