టీడీపీ జనసేన మధ్య.. అసలు సమస్య మొదలు !

వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే లక్ష్యంతో టీడీపీ జనసేన పార్టీలు( TDP Janasena Parties ) ఏకమైన సంగతి తెలిసిందే.

టీడీపీ జనసేన కూటమితో వైసీపీకి చెక్ పెట్టాలని ఇరు పార్టీల అధినేతలు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆ దిశగా వ్యూహాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు కూడా.ఇటీవల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసిన రెండు పార్టీలు.

ఇకపై ఎలాంటి కార్యక్రమమైన కలిసే నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.కాగా టీడీపీలో నిన్నమొన్నటి వరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఆ పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో టీడీపీ కొంత ఊపిరి పిల్చుకుంది.

ఇక భవిష్యత్ కార్యచరణపై చంద్రబాబు దృష్టి సారించారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ? జనసేన పార్టీ( Janasena Party )కి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశాలపై బాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

"""/" / అందులో భాగంగానే తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తో చంద్రబాబు బేటీ అయ్యారు కూడా.

ఈ భేటీలో చాలా అంశాలపైనే సుధీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.సీట్ల కేటాయింపుతో పాటు, సి‌ఎం అభ్యర్థి విషయంలో కూడా చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అలాగే త్వరలో ప్రకటించబోయే మేనిఫెస్టో పై కూడా ఉమ్మడిగా కసరత్తులు జరుపుతున్నాట్లు సమాచారం.

ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టో పేరుతో కొన్ని హామీలను గతంలోనే ప్రకటించింది.వాటితో పాటు జనసేన మేనిఫెస్టో( Jana Sena Manifesto ) మరియు టీడీపీ తుది మేనిఫెస్టో రెండిటినీ బేరీజు వేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేలా అధినేతలు ప్లాన్ చేస్తున్నారట.

"""/" / అయితే వీటి విషయంలో ఇరు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

సీట్ల కేటాయింపులో అలాగే మేనిఫెస్టో రూపకల్పనలోనూ టీడీపీ ( TDP )డామినేషన్ ఉంటుందా లేదా పవన్ పట్టు సాధిస్తారా అనేది చూడాలి.

ఇకపోతే బీజేపీని కలుపుకునే విషయంలో కూడా ఈ రెండు పార్టీలు తుది నిర్ణయానికి రావాల్సివుంది.

ఇప్పటికే జనసేన ఎన్డీయే కూటమిలో భాగమై ఉండగా.రాష్ట్రంలో మాత్రం బీజేపీతో నామమాత్రంగానే పొత్తులో కొనసాగుతూ వస్తోంది.

మరి బీజేపీ కూడా కూటమిలో భాగమౌతుందా ? అసలు వీటన్నిటిని పవన్ చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి.

గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కార్చగల టాలెంటెడ్ యాక్టర్లు.. ఎవరంటే..