ఇదే స్ఫూర్తితో మెరుగైన సేవలు అందించాలి

వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ అభినందన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్ పొందగా, ఇదే స్ఫూర్తితో  రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు.

రోగులకు అత్యుత్తమ, మెరుగైన వైద్యం అందించడం, ఆరోగ్య కేంద్రంలోని విభాగాల మెరుగైన నిర్వహణకు గానూ గంభీరావుపేట మండలం లింగన్నపేట పీ హెచ్ సీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్క్వాస్ సర్టిఫికెట్ పొందగా, శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వైద్య బృందానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమి, ఇంఛార్జి జిల్లా వైద్యాధికారి డా.

రజిత, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీరాములు, ప్రోగ్రామ్ అధికారులు డా.

నయీమా, ఉమ, క్వాలిటీ మేనేజర్ సాగర్, లింగన్నపేట మెడికల్ ఆఫీసర్ డా.వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యూఎస్: నేపాలీ భార్యను చంపిన భర్త.. అతని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్‌కు షాక్..?