ఎలాంటి మచ్చలనైనా మాయం చేసే తమలపాకు.. ఎలా వాడాలంటే?

ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ముఖ చర్మం పై ఏదో ఒక కారణం చేత మచ్చలు ఏర్పడుతుంటాయి.

ఇవి ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తాయి.ముఖాన్ని కాంతిహీనంగా చూపిస్తాయి.

దీంతో చాలా మంది చర్మం పై ఏర్పడిన మచ్చలను వదిలించుకునేందుకు తోచిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే తీవ్రంగా మదన పడుతుంటారు.అయితే వర్రీ వద్దు.

ఎలాంటి మచ్చలనైనా మాయం చేసే గుణం తమలపాకుకు ఉంది. """/" / మచ్చలేని చర్మాన్ని అందించడానికి తమలపాకు( Betel Leaf ) అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ తమలపాకును చ‌ర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు లేదా నాలుగు ఫ్రెష్ తమలపాకులు తుంచి వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు( Curd ), రెండు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న తమలపాకు పేస్ట్‌లో ముల్తానీ మట్టి, పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmaric ), వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.దాదాపు ఇర‌వై నిమిషాల పాటు చార్మాన్ని ఆరబెట్టుకుని.

అప్పుడు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్న కొద్ది రోజుల్లోనే క్రమంగా మాయం అవుతాయి.

మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.కాబట్టి మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా తమలపాకులతో పైన చెప్పిన విధంగా చేయండి.

పైగా ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది.

స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.

7/జీ బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్.. ఆ రేంజ్ హిట్ ను అందుకుంటారా?