త‌ల‌నొప్పిని క్ష‌ణాల్లోనే దూరం చేసే త‌మ‌ల‌పాకు.. ఎలాగంటే?

నేటి ఆధునిక కాలంలో చాలా మందిని కామ‌న్‌గా వేధించే స‌మ‌స్యల్లో త‌ల‌నొప్పి ఒక‌టి.

రెగ్యుల‌ర్‌గా కాక‌పోయినా వారానికి ఒక‌సారి అయినా ప‌ల‌క‌రించే ఈ త‌ల‌నొప్పి స‌మ‌స్య‌.చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది.

నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో త‌ల‌నొప్పి రావ‌డం స‌హ‌జ‌మే.ప‌ని ఒత్త‌డి, ఆందోళ‌న‌, నిద్ర‌లేమి, ఆహార‌పు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ త‌ల‌నొప్పి స‌మ‌స్య వేధిస్తుంటుంది.

అయితే త‌ల‌నొప్పి రాగానే చాలా మంది ట‌క్కున పెయిన్ కిల్ల‌ర్స్ వేసేసుకుంటారు.కానీ, న్యాచుర‌ల్‌గా కూడా త‌ల‌నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

ముఖ్యంగా త‌ల‌నొప్పిని క్ష‌ణాల్లోనే త‌గ్గించ‌డంలో త‌మ‌ల‌పాకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.త‌మల‌పాకులో విటమిన్ ఎ, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ-ఫంగల్, యాంటీ-సెప్టిక్ గుణాలు, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉన్నాయి.

ఇవి ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అలాగే త‌ల‌నొప్పితో బాధ ప‌డేవారికి కూడా త‌మ‌ల‌పాకులు ఉప‌యోగ‌‌ప‌డ‌తాయి.

మ‌రి ఇంత‌కీ త‌మ‌ల‌పాకును ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

"""/" / ముందుగా నాలుగు లేదా ఐదు త‌మ‌ల‌పాకుల‌ను తీసుకుని.మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ త‌మ‌ల‌పాకుల పేస్ట్‌ను నుదిట‌పై అప్లై చేస్తే.క్ష‌ణాల్లోనే త‌ల‌నొప్పి స‌మ‌స్య దూరం అవుతుంది.

అలాగే ఒక్కోసారి వాతం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.అలాంటి స‌మ‌యంలో త‌మ‌ల‌పాకుల నుంచి ర‌సం తీసుకోవాలి.

ఆ ర‌సాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే.త్వ‌ర‌గా త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక త‌మ‌ల‌పాకుల‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.ఏవైనా గాయాల‌ను త‌గ్గించ‌డంలో త‌మ‌ల‌పాకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

లేత‌గా ఉన్న త‌మ‌ల‌పాకు‌ను తీసుకుని.దానికి నెయ్యి రాసి గాయలపైన కడితే.

త్వ‌ర‌గా గాయం న‌యం అవుతుంది.అలాగే జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలోనూ త‌మ‌ల‌పాకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

తమలపాకుల నుంచి ర‌సం తీసుకుని.అందులో న‌ల్ల మిరియాల పొడి మిక్స్ చేసి తీసుకుంటే త్వ‌ర‌గా జ్వ‌రం త‌గ్గిపోతుంది.

ఈ ఇంటి చిట్కాలతో నెలసరి అవ్వదు ఇక ఆలస్యం..!