తమలపాకుల సాగులో ఈ జాగ్రత్తలు త‌ప్ప‌నిస‌రి

తమలపాకు మొక్కలకు కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు గరిష్టంగా 30 డిగ్రీలు అవసరం ఉంటుంది.

తమలపాకు సాగు విపరీతమైన చలి లేదా వేడికి పంట దెబ్బతింటుంది.ఈ నేపథ్యంలో విపరీతమైన చలి నుండి తమలపాకులను రక్షించుకోవడానికి నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారం నుండి తమల పాకు సాగులో వేడి వాతావ‌ర‌ణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

చల్లని వాతావరణంలో కొద్దిపాటి నీటిపారుదల చేయాలిసిన అవసరం ఉంటుంది.దీని కారణంగా పంట ప్రదేశమైన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది.

దీని ద్యారా తమలపాకులు చెడిపోకుండా కాపాడుకోవచ్చు.ఈ త‌మ‌ల పాకుల‌ను సాగు చేసేముందు నేల‌ను దున్నడం ద్వారా మట్టి మెత్తగా అవుతుంది.

ఆ తర్వాతే తీగ‌ల‌ను ఏర్పాటు చేయాలి.తమలపాకు సాగు కోసం సున్నంతో సరళ రేఖలు గీసి ఈ లైన్లపై మూడు నుంచి నాలుగు మీటర్ల వెదురు గడలను ఒక మీటరు వ్యవధిలో పాతిపెట్టాలి.

దానికి పందిరి అల్లాలి.తద్వారా త‌మ‌ల‌పాకు మొక్క‌ల‌కు ర‌క్ష‌ణ దొరుకుతుంది.

ఇది త‌మ‌ల‌పాకు తీగ‌లు ఎదిగేందుకు స‌హ‌క‌రిస్తుంది.అలాగే తుపానులో ఈ మొక్క‌ల‌కు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు వెదురు గడకు.

వెదురు గడకు దూరం 50 సెం.మీ ఉండేలా చూసుకోవాలి.

మిగిలిపోయిన అన్నంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఎలాగంటే?