ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌డం లేదా..ఇలా చేస్తే స‌రి!

స్లిమ్‌గా, నాజూగ్గా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, నేటి కాలంలో అధిక బ‌రువు స‌మ‌స్య ఎంద‌రినో ప‌ట్టి పీడిస్తుంది.

దాంతో ఇష్ట‌మైన ఆహారాల‌కు దూరంగా ఉంటూ, చెమ‌ట‌లు చిందేలా వ‌ర్కౌట్లు చేస్తూ, డైట్లు ఫాలో అవుతూ తీవ్రంగా శ్ర‌మిస్తారు.

విచిత్రం ఏంటంటే ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా కొంద‌రు బ‌రువు త‌గ్గ‌నే త‌గ్గ‌రు.అలాంటి వారు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.

సులువుగా వెయిట్ లాస్ అవ్వొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మ‌రి లేట్ చేయ‌కుండా ఆ టిప్స్‌పై ఓ లుక్కేసేయండి.

సాధార‌ణంగా కొంద‌రు త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు.

కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర శ‌క్తిహీనంగా మారిపోతుంది.దాంతో మధ్యాహ్నం తినాల్సిన ఫుడ్ కంటే ఎక్కువ‌గా లాంగించేస్తారు.

కాబ‌ట్టి, బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్‌ చేయ‌రాదు.మ‌రియు బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి.

త‌ద్వారా రోజంతా తక్కువ ఆహారం తీసుకుంటారు. """/"/ అలాగే వెయిట్ లాస్ అవ్వాల‌నుకునే వారు.

భోజ‌నానికి ముందు సూప్ తీసుకోవాలి.దాంతో త‌క్కువ‌గా తింటారు.

బ‌రువూ త‌గ్గుతారు.వెయిట్ లాస్‌ అవ్వాలంటే.

మంచి నిద్ర ఎంతో అవ‌స‌రం.నిద్రను నిర్ల‌క్ష్యం చేస్తూ ఎన్ని చేసినా బ‌రువు త‌గ్గ‌రు.

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఏడు నుంచి ఎనిమిది గంట‌ల పాటు నిద్రించాలి.గ్రీన్ టీ బ‌రువును త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల‌, ఏ రోజూ కూడా గ్రీన్ టీ స్కిప్ చేయ‌కూడ‌దు.అదేవిధంగా, బ‌రువు త‌గ్గాలంటే వారంలో ఖ‌చ్చితంగా ఐదు రోజులు వ్యాయామం చేయాలి.

వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.షుగర్, కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను అస్స‌లు తీసుకోరాదు.

ఇక నైట్ తీసుకునే ఫుడ్ లైట్‌గా ఉండాలి.డే టైమ్‌లో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినాలి.

ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, ఐస్ క్రీమ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

బాలయ్య మోక్షజ్ఞ కాంబో లో భారీ మల్టీ స్టారర్…డైరెక్టర్ ఎవరంటే..?