ఒత్తైన ఐబ్రోస్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ను మీరు ట్రై చేయాల్సిందే!

ఈ మధ్యకాలంలో ఒత్తైన ఐబ్రోస్( Thick Eyebrows ) అనేది ఫ్యాషన్ గా మారింది.

చాలా మంది ఒత్తైన ఐబ్రోస్( Eyebrows ) కోసం ఆరాటపడుతున్నారు.ఈ క్రమంలోనే ఐబ్రోస్ ను ఒత్తుగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ అద్భుతంగా సహాయపడతాయి.

ఈ టిప్స్ ను ట్రై చేస్తే ఎంత పల్చగా ఉన్న కనుబొమ్మలైన కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / గుడ్డులోని పచ్చసొన ఐబ్రోస్ పెరుగుదలకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.

అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చ సోన( Egg Yolk ) మరియు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూడు నాలుగు సార్లు ఐబ్రోస్ ను అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు వదిలేయాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే కొద్ది రోజుల్లోనే కనుబొమ్మలు ఒత్తుగా మారతాయి.

"""/" / అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ జ్యూస్( Onion Juice ) లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేయండి.

ఇప్పుడు దీనిని దూది సహాయంతో ఐబ్రోస్ కు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

లేదా నైట్ నిద్రించే ముందు అప్లై చేసుకుని మార్నింగ్ అయినా కూడా వాష్ చేసుకోవచ్చు.

ఇలా ఎలా చేసినా కూడా ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి.ఇక‌ నువ్వుల నూనె సైతం ఐబ్రోస్ ఎదుగుదలకు అద్భుతంగా సహాయపడుతుంది.

నైట్ నిద్రించే ముందు నువ్వుల నూనెను కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేయాలి.

ఆ తర్వాత ఆ నూనెను కనుబొమ్మలపై అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని పడుకోవాలి.

ఇలా రోజు కనుక చేస్తే మీ ఐబ్రోస్ కొద్ది రోజుల్లోనే దట్టంగా మారతాయి.

కెనడా నిండిపోయింది.. నీ దేశానికి పో , భారతీయుడిపై నోరు పారేసుకున్న కెనడియన్ మహిళ