మ‌జ్జిగ‌ను ఈ విధంగా తీసుకుంటే వేస‌విలోనూ ఉత్సాహంగా ఉండొచ్చు!

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఎండ‌లు రోజురోజుకు దంచికొడుతుండ‌టంతో.

ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటేనే బెంబేలిత్తిపోతున్నారు.మండే ఎండలు ఒక‌వైపు అయితే.

మరో వైపు ఉక్కపోత, వడగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.దీంతో వేస‌వి వేడిని త‌ట్టుకోవ‌డానికి, శ‌రీరాన్ని చ‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి చాలా మంది మ‌జ్జిగ‌ను డైట్‌లో చేర్చుకుంటున్నారు.

అయితే మ‌జ్జిగ‌ను డైరెక్ట్‌గా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే వేస‌విలోనూ ఉత్సాహంగా ఉండొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా ఫ్రెష్‌గా ఉన్న‌ గులాబీ రేక‌ల‌ను ఓ గుప్పెడు తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో గులాబీ రేక‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌టిక బెల్లం పొడి, చిటికెడు న‌ల్ల ఉప్పు మ‌రియు కొద్దిగా వాట‌ర్ పోసి మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గులాబీ రేక‌ల పేస్ట్‌లో రెండు గ్లాసుల పల్చ‌టి ముజ్జిగ‌ను వేసి బాగా షేక్ చేసి.

అప్పుడు సేవించాలి.మజ్జిగ‌ను డైరెక్ట్‌గా కాకుండా పైన చెప్పిన విధంగా తీసుకుంటే అధిక వేడి తగ్గి శ‌రీరం చ‌ల్ల‌గా, ఉత్సాహంగా మారుతుంది.

నీర‌సం, ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటివి దూరం అవుతాయి.డీహైడ్రేష‌న్ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉంటారు.

వ‌డదెబ్బ కొట్ట‌కుండా ఉంటుంది.మ‌రియు బాడీ త్వరగా అలసిపోకుండా కూడా ఉంటుంది.

"""/"/ అలాగే మ‌రో విధంగా కూడా మ‌జ్జిగ‌ను తీసుకోవ‌చ్చు.ఒక గ్లాస్ ప‌ల్చ‌టి మ‌జ్జిగ‌ను తీసుకుని.

అందులో వ‌న్ టేబుల్ స్పూన్ పుదీనా ర‌సం, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం, చిటికెడు న‌ల్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల స‌బ్జా గింజ‌లు(నాన‌బెట్టిన‌వి) వేసి బాగా క‌లిపి సేవించాలి.

ఈ విధంగా మ‌జ్జిను తీసుకున్నా వేస‌విలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండొచ్చు.కాబ‌ట్టి, వీటిని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై ఎన్ఆర్ఐల ఇంట్రెస్ట్ .. ఎందుకిలా?