బియ్యం కడిగిన నీటిలో వీటిని కలిపి జుట్టుకు పట్టిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!
TeluguStop.com
( Hair Fall ) అందరిలోనూ ఉండేదే.కానీ కొందరికి మాత్రం చాలా అధికంగా ఉంటుంది.
పైగా హెయిర్ గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు.దీంతో ఉన్న జుట్టు ఊడిపోతుంది.
కానీ కొత్త జుట్టు రాదు.ఫలితంగా కొద్ది రోజుల్లోనే కురులు చాలా పల్చగా మారిపోతుంటాయి.
మీరు కూడా అధిక హెయిర్ ఫాల్ సమస్య( Hair Fall Problem )తో బాధపడుతున్నారా.
? జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదా.? డోంట్ వర్రీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ అన్నమాటే అనరు.
సాధారణంగా చాలామంది బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటారు.కానీ ఆ నీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడానికి బియ్యం కడిగిన నీరు అద్భుతంగా సహాయపడతాయి.
ఇంతకీ ఆ వాటర్ ని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కలబంద ఆకుని( Aloe Vera Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల బియ్యం కడిగిన వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు మరియు ఒక కప్పు కరివేపాకు వేసి మరిగించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు వాటర్ మరిగిన తర్వాత స్టాప్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకొని బాగా మిక్స్ చేస్తే మంచి టోనర్ సిద్ధమవుతుంది.
"""/" /
ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపును ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు కనుక చేస్తే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.
అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.
కొద్ది రోజుల్లోనే మీ కురులు ఒత్తుగా పొడుగ్గా మారుతాయి.
ఎంత మంచి మనసయ్య నీది రిషభ్ పంత్.. ఆదాయంలో 10 శాతం పేదలకు