ఒక్క స్పూన్ ధనియాలతో ఎంత లావుగా ఉన్న సన్నబడొచ్చు.. ఎలాగంటే?
TeluguStop.com
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు( Coriander ) ఒకటి.
వంటల్లో ధనియాలను విరివిరిగా వాడుతుంటారు.చక్కని రుచి ఫ్లేవర్ ను అందించడంలో ధనియాలకు సాటే లేదు.
ధనియాల ధర తక్కువే అయినా.వాటిల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా ధనియాలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే వెయిట్ లాస్ ( Weight Loss )కు కూడా ధనియాలు సహాయపడతాయి.
ఒక్క స్పూన్ ధనియాలతో ఎంత లావుగా ఉన్నా సన్నబడొచ్చు.మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, రెండు యాలకులు( Cardamom ) వేసి స్లైట్ గా వేయించుకోవాలి.
ఆ తర్వాత ధనియాలు మరియు యాలకులను మెత్తగా దంచి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం( Ginger ) తురుము మరియు దంచి పెట్టుకున్న ధనియాలు, యాలకుల పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
"""/" /
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.
ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలను త్వరగా బర్న్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.
వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.
పైగా ఈ డ్రింక్ వల్ల పొట్ట కొవ్వు కరుగుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఏమైనా ఉంటే నయం అవుతాయి.
ఒత్తిడి చిత్తవుతుంది.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.
మరియు ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఈ డ్రింక్ పని చేస్తుంది.