రెండు స్పూన్ల కొబ్బరి నూనెతో ఇలా చేశారంటే మీ చేతులు వైట్ గా బ్రైట్ గా మెరిసిపోతాయి!

సాధారణంగా కొందరికి బాడీ మొత్తం తెల్లగా మృదువుగా ఉన్నా చేతులు( Hands ) మాత్రం డార్క్ గా అసహ్యంగా కనిపిస్తుంటాయి.

ఈ క్రమంలోనే చాలామంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి చేతులకు మానిక్యూర్( Manicure ) చేయించుకుంటూ ఉంటారు.

ఇందుకోసం ప్రతి నెల వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో చేతులను వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.

మరి అందుకు కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చేతుల‌ను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం మూడు నాలుగు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకొని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీని రెండు రోజులకు ఒకసారి పాటించాలి. """/" / అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఉదయం మరియు నైట్ నిద్రించే ముందు ఇలా చేయాలి.

ఈ రెండు చిట్కాలను పాటించడం ద్వారా సహజంగానే చేతుల‌ను తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.

"""/" / మొదట చెప్పుకున్న రెమెడీ వల్ల చేతులు పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.

అన్ వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది.అలాగే రెండో రెమెడీ వల్ల చేతులు మృదువుగా కోమలంగా మారతాయి.

డ్రై అవ్వకుండా ఉంటాయి.షైనీ గా మెరుస్తాయి.

కాబట్టి వైట్ అండ్ బ్రైట్ హ్యాండ్స్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ రెండు చిట్కాలను ప్రయత్నించండి.