పాల‌కూర అంటే మీకు న‌చ్చ‌దా? అయితే ఇలా ట్రై చేయండి!

పాల‌కూర‌.అద్భుత‌మైన ఆకుకూర‌ల్లో ఇది ఒక‌టి.

పాల‌కూర‌లో మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో అమోఘ‌మైన పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అందుకే వారంలో క‌నీసం రెండు సార్లు అయినా పాల‌కూర‌ను తిన‌మ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

కానీ, పాలకూర ఇష్టంగా తినే వాళ్ళు చాలా తక్కువ.కారణం దాని రుచి, వాస‌న‌.

పిల్ల‌లే కాదు పెద్ద‌ల్లో కూడా చాలా మంది పాల‌కూర‌ను తినేందుకు అస్స‌లు మొగ్గు చూప‌రు.

మీరు ఈ లిస్ట్‌లో ఉన్నారా.? పాల‌కూర అంటే మీకు న‌చ్చ‌దా.

? అయితే డోంట్ వ‌ర్రీ.ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా పాల‌కూర‌ను తీసుకునేందుకు ట్రై చేస్తే టేస్ట్‌తో పాటు బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా మీసొంతం అవుతాయి.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక క‌ప్పు పాల‌కూర‌, కొద్దిగా వాట‌ర్ వేసి బాగా క‌ల‌పాలి.

ఆపై మూత పెట్టి నాలుగంటే నాలుగు నిమిషాల పాటు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.అలాగే మ‌రోవైపు ఒక బౌల్‌లో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్‌, వాట‌ర్ వేసుకుని ఒక గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఉడికించుకున్న పాల‌కూర‌, నాన‌బెట్టుకున్న ఓట్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పీన‌ట్ బ‌ట‌ర్‌, నాలుగు పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పులు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, ఒక గ్లాస్ బాదం పాలు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

త‌ద్వారా పాల‌కూర ఓట్స్ స్మూతీ సిద్ధం అవుతుంది. """/"/ ఈ స్మూతీ సూప‌ర్ టేస్ట్‌ను క‌లిగి ఉంటుంది.

పాల‌కూర‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఈ విధంగా స్మూతీని త‌యారు చేసుకుని తీసుకుంటే చాలా మంచిది.

ముఖ్యంగా ఈ స్మూతీ డైట్‌లో ఉంటే వెయిట్ లాస్ అవుతారు.ర‌క్త‌హీన‌త పరార్ అవుతుంది.

మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

ఎముక‌ల బ‌లంగా త‌యార‌వుతాయి.చ‌ర్మం నిగారింపుగా కూడా మారుతుంది.

కల్కి సినిమాపై అల్లు అర్జున్ అదిరిపోయే రివ్యూ.. బన్నీకి మూవీ అంతలా నచ్చేసిందా?