బొప్పాయి తో బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా?

ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పండ్లలో బొప్పాయి( Papaya ) ఒకటి.ధర తక్కువే అయినప్పటికీ బొప్పాయి పండులో పోషకాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి.

అందువల్ల బొప్పాయి అనేక హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుంది.క్యాన్సర్ తో సహా వివిధ రకాల జబ్బులు ద‌రిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.

అలాగే ఇటీవల రోజుల్లో అధిక బరువు( Over Weight ) అనేది ఎంతో మందికి అతి పెద్ద శత్రువుగా మారింది.

అయితే బొప్పాయితో బరువు కూడా తగ్గొచ్చు.వెయిట్ లాస్ కు( Weight Loss ) మద్దతు ఇచ్చే పండ్లలో బొప్పాయి ఒకటి.

మరి ఇంతకీ బొప్పాయితో బరువు ఎలా తగ్గొచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్,( Oats ) రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) వన్ టీ స్పూన్ చియా సీడ్స్ మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పీల్ తొలగించిన బొప్పాయి పండు ముక్కలతో పాటు నానబెట్టుకున్న పదార్థాలు మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే బొప్పాయి ఓట్స్ స్మూతీ( Papaya Oats Smoothie ) రెడీ అవుతుంది.

ఈ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు మంచి ఎంపిక అవుతుంది.

"""/" / ఉదయం అల్పాహారం సమయంలో ఈ బొప్పాయి ఓట్స్ స్మూతీని కనుక తీసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

అతి ఆకలిని అణచివేస్తుంది.బొప్పాయి మరియు ఓట్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ బొప్పాయి ఓట్స్ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.

"""/" / పైగా ఈ స్మూతీ లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తాయి.

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు అనారోగ్యాల నుంచి రక్షించడానికి తోడ్పడుతుంది.

బొప్పాయి ఓట్స్ స్మూతీ జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని పెంచుతుంది.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది.

వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!