కలర్స్ అక్కర్లేదు.. తెల్ల జుట్టును మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీ మీకోసం!
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య( White Hair ) బారిన పడుతున్నారు.
తక్కువ వయసులోనే జుట్టు తెల్ల బడిందంటే ఎక్కడ ముసలి వారిలా కనిపిస్తామో అని ఎక్కువ శాతం మంది ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధారపడుతుంటారు.
అయితే అవి జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తిస్తాయి.కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే కలర్స్ అక్కర్లేదు.
సహజంగానే తెల్ల జుట్టును మాయం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటి అనేది లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక బొప్పాయి ఆకును( Papaya Leaf ) తుంచి వేసుకోవాలి.
అలాగే మూడు తమలపాకులు( Betel Leaves ) మరియు మూడు మందారం ఆకులు తుంచి వేసుకోవాలి.
ఆపై ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna Powder) ను వేసుకోవాలి.
"""/" /
ఈ పౌడర్ లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ను వేసి బాగా మిక్స్ చేసి నాలుగు గంటల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల తెల్లగా మారిన జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
"""/" /
తెల్ల జుట్టును సహజంగా నివారించడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలడం సైతం తగ్గుముఖం పడుతుంది.
చుండ్రు సమస్య ఉన్న సరే దెబ్బకు పరార్ అవుతుంది.కాబట్టి, ఎవరైతే చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారో వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
బన్నీ కారణంగా ఇండస్ట్రీ మొత్తం తలవంచింది.. ఫైర్ అయిన తమ్మారెడ్డి?