ఆయిలీ స్కిన్ ను వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యారా.. అయితే ఇలా చేయండి చాలు!
TeluguStop.com
ఆయిలీ స్కిన్( Oily Skin ).చాలామంది ఇటువంటి చర్మ తత్వాన్ని కలిగి ఉంటారు.
ఆయిలీ స్కిన్ కారణంగా ముఖం ఎప్పుడు జిడ్డు జిడ్డు గానే ఉంటుంది.మేకప్ వేసుకున్న కొద్ది నిమిషాలకే చెదిరిపోతుంది.
పైగా ఆయిలీ స్కిన్ వల్ల మొటిమలు మచ్చలు వంటి సమస్యలు కూడా అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే ఆయిలీ స్కిన్ ను వదిలించుకునేందుకు ఫిక్స్ అవుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు మీకు చాలా గ్రేట్ గా సహాయపడతాయి.
ఈ చిట్కాలతో సులభంగా ఆయిలీ స్కిన్ కు బై బై చెప్పవచ్చు.మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
"""/" /
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి( Multani Mitti ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు సరిపడా టమాటో జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని రోజుకు ఒకసారి కనుక పాటిస్తే చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
ఆయిలీ స్కిన్ సమస్య దూరం అవుతుంది.చర్మం ఫ్రెష్ గా షైనీ గా మెరుస్తుంది.
"""/" /
ఆయిలీ స్కిన్ సమస్య నుంచి బయటపడటానికి బొప్పాయి( Papaya ) అద్భుతంగా సహాయపడుతుంది.
కొన్ని బొప్పాయి పండు ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి జ్యూస్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ ను ఐస్ ట్రే లో నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
ఈ ఐస్ క్యూబ్స్ ను రోజుకు ఒకటి లేదా రెండు తీసుకుని ముఖానికి బాగా రబ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఆయిలీ స్కిన్ సమస్య దూరం అవ్వడమే కాదు మొండి మచ్చలు మాయమవుతాయి.
బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తొలగిపోతాయి. """/" /
అలాగే ఆయిలీ స్కిన్ సమస్య( Oily Skin Problem )తో బాధపడేవారు బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
శరీరానికి అవసరమయ్యే వాటర్ ను అందించాలి.షుగర్, కూల్ డ్రింక్స్, స్పైసీ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి.
చాలామంది చర్మం జిడ్డుగా ఉందని మాయిశ్చరైజర్ ను దూరం పెడుతుంటారు.కానీ ఇలా అస్సలు చేయకండి ఆయిలీ స్కిన్ కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్స్ కూడా ఎన్నో ఉన్నాయి.
వాటిలో ఒక దానిని సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్ వాడండి.
కాబోయే పెళ్లి కూతుళ్లు ముఖం కళకళ మెరిసిపోవాలంటే ఇలా చేయండి!