మొలకలను డైరెక్ట్‌గా తిన‌లేక‌పోతున్నారా? ఇలా ట్రై చేస్తే మ‌స్తు బెనిఫిట్స్‌!

మొల‌క‌లు లేదా మొల‌కెత్తిన విత్త‌నాలు లేదా స్ప్రౌట్స్‌.ఇవి మ‌న ఆరోగ్యానికి చేసే మేలు, అందించే ప్ర‌యోజ‌నాల గురించి ఎంత‌ చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

మొలకల్లో పోష‌కాలు ఎక్కువ‌గా, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.అందుకే వీటిని రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

కానీ, చాలా మంది మొల‌క‌ల రుచిని ఇష్ట‌ప‌డ‌రు.ఈ నేప‌థ్యంలోనే ఆరోగ్యానికి మంచివ‌ని తెలిసినా.

వాటిని ఎవైడ్ చేస్తుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.

? అయితే డోంట్ వ‌ర్రీ.ఇక‌పై ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా స్ప్రౌట్స్ ను తీసుకునేందుకు ట్రై చేస్తే రుచికి రుచి.

ఆరోగ్యానికి ఆరోగ్యం.మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో రెండు క‌ప్పుల‌ మొల‌క‌లను వేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో అర క‌ప్పు ఉల్లిపాయ ముక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, అర క‌ప్పు ట‌మాటో త‌రుగు, రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సిక‌మ్ ముక్క‌లు, గుప్పెడు వేయించిన వేరుశెగ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ కారం, పావు స్పూన్ చాట్ మ‌సాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర పొడి, నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, రుచికి స‌రిప‌డా ఉప్పు, మ‌రియు కొద్దిగా కొత్తిమీర త‌రుగు వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు బాగా మిక్స్ చేసుకుంటే స్ప్రౌట్స్ స‌లాడ్ సిద్ధం అవుతుంది.

"""/"/ ఈ మొల‌క‌ల స‌లాడ్ రుచిగా ఉండ‌టమే కాదు.మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.

ముఖ్యంగా ఈ మొల‌కల సలాడ్‌ను తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్, ప్రోటీన్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి.

గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సూప‌ర్ స్ట్రోంగ్ అవుతుంది.

ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మ‌రియు చ‌ర్మం నిగారింపుగా, జుట్టు ఒత్తుగా మారుతుంది.

చిరంజీవి పాటలకు విరాట్ కొహ్లీ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడా.. అసలేం జరిగిందంటే?