గుండెకు అండగా నిలిచే కలబంద.. ఇలా తీసుకుంటే మరెన్నో ప్రయోజనాలు మీ సొంతం!

కలబంద.( Aloevera )దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఖ‌చ్చితంగా ఉంటుంది.చ‌ర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, జుట్టు సంరక్షణకు కలబందను విరివిరిగా వాడుతుంటారు.

అయితే ఆరోగ్యానికి సైతం కలబంద ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా గుండెకు కలబంద అండగా ఉంటుంది.

ఇప్పుడు చెప్పబోయే విధంగా కలబంద ను తీసుకుంటే మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు( Health Benefits) మీ సొంతం అవుతాయి.

"""/" / అందుకోసం ఒక కలబంద ఆకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి లోపల ఉండే జెల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి సేవించాలి.

వారానికి కనీసం మూడు సార్లు అయినా ఈ కలబంద జ్యూస్ ను తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్( Bad Cholestrol ) కలుగుతుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.గుండెపోటుతో సహా వివిధ రకాల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అలాగే ఈ కలబంద జ్యూస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

పొట్ట కొవ్వు దెబ్బ‌కు కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

"""/" / అంతేకాదు కలబంద జ్యూస్( Aloevera Juice ) ను డైట్ లో చేర్చుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు దూరమవుతాయి.

రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.పుండ్లు ఏమైనా ఉంటే త్వరగా తగ్గుముఖం పడతాయి.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్( Body Detox ) అవుతుంది.శరీరంలో అధిక వేడి ఉన్నా సరే మాయం అవుతుంది.

మరియు చర్మం నిగారింపుగా యవ్వనంగా సైతం మెరుస్తుంది.