ముఖాన్ని ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంచే బెస్ట్‌ వెజిటేబుల్ ప్యాక్స్ మీకోసం!

త‌న ముఖం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందు కోస‌మే ఎన్నెన్నో చేస్తుంటారు.

ఖ‌రీదైన క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు యూజ్ చేస్తారు.బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్లి ఫేషియ‌ల్స్ చేయించుకుంటారు.

అయితే ఇవేమి కాకుండా ఇంట్లోనే కొన్ని వెజిటేబుల్ ప్యాక్స్‌ను ట్రై చేస్తే గ‌నుక స‌హ‌జ సిద్ధంగానే ముఖాన్ని య‌వ్వ‌నంగా మెరిపించుకోవ‌చ్చు.

మ‌రి టైమ్ వేస్ట్ చేయ‌కుండా ఆ వెజిటేబుల్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పీల్ తీసిన ఒక బంగాళ‌దుంప‌, బాగా పండిన ఒక తీసుకుని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ఎర్ర కంది ప‌ప్పు, మూడు స్పూన్ల బంగాళ‌దుంప.

ట‌మాటా పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంతో ప్యాక్ వేసుకుని ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి అప్పుడు చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చ‌ర్మం మృదుగా, తేమ‌గా మారుతుంది.మ‌రియు మృత‌క‌ణాలు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

/br """/"/ అలాగే కాకార‌కాయ కూడా చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది.ఒక కాక‌ర‌కాయ‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సంలో తీసుకోవాలి.

ఇప్పుడు ఈ ర‌సంలో రెండు స్పూన్ల ముల్తానీ మ‌ట్టి, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

అపై ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని పావు గంట త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఈ ప్యాక్ వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి.చ‌ర్మం గ్లోగా మ‌రియు హైడ్రేటెడ్‌గా మారుతుంది.

/br ఇక గుమ్మ‌డి కాయతోనూ చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మార్చుకోవ‌చ్చు.ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్ల గుమ్మ‌డి కాయ పేస్ట్‌, ఒక స్పూన్‌ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మానికి ముఖానికి అప్లై చేసి.కాస్త ఆరిన త‌ర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ ప్యాక్ వ‌ల్ల ఆయిలీ స్కిన్ స‌మ‌స్య ఉండ‌దు.చ‌ర్మం ఎల్ల‌ప్పుడు తాజాగా, య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

ఎవరినీ వడలం వడ్డీతో సహా చెల్లిస్తాం .. వైసీపీ హెచ్చరిక