వృద్ధాప్య లక్షణాల‌కు దూరంగా ఉండాలంటే పురుషులు ఖ‌చ్చితంగా వీటిని పాటించాల‌ట‌!

య‌వ్వ‌నంగా మెరిసిపోవాల‌నే కోరిక స్త్రీల‌కే కాదు పురుషుల‌కు ఉంటుంది.కానీ, ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది పురుషులు చిన్న వ‌య‌సులోనే వృద్ధాప్య ల‌క్ష‌ణాల‌ను ఎదుర్కొంటున్నారు.

నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయడం, ఆహార‌పు అల‌వాట్లు, చ‌క్కెర‌ను అధికంగా తీసుకోవ‌డం, కాలుష్యం, స్కిన్ కేర్ లేక‌పోవ‌డం, మ‌ద్య‌పానం, ఎండ‌ల్లో ఎక్కువ తిర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల త‌క్కువ వ‌య‌సుకే చ‌ర్మంపై ముడ‌త‌లు, పొడి చ‌ర్మం, స‌న్న‌ని చార‌లు వ‌చ్చేస్తుంటాయి.

దాంతో వాటిని క‌వ‌ర్ చేయ‌లేక పురుషులు తెగ క‌ల‌వ‌ర‌ ప‌డిపోతుంటారు.అయితే వృద్ధాప్య లక్షణాల‌కు దూరంగా ఉండాలంటే పురుషులు ఖ‌చ్చితంగా కొన్ని చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.వ‌య‌సు పెరిగినా య‌వ్వ‌నంగానే క‌నిపించాల‌ని కోరుకునే పురుషులు ప్ర‌తి రోజు పాలు, రోజ్‌వాట‌ర్‌తో మసాజ్ చేసుకోవాలి.

రెండు టేబుల్ స్పూన్ల పాల‌కు ఒక స్పూన్ రోజ్‌ వాట‌ర్ క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఆపై స్మూత్‌గా కాసేపు మ‌సాజ్ చేసుకుని డ్రై అయిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు త‌గ్గ‌డ‌మే కాదు మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా ఉంటాయి.

ద్రాక్ష ర‌సం మంచి యాంటీ ఏకింగ్ డ్రింక్‌లా ప‌ని చేస్తుంది.వారంలో మూడు లేదా నాలుగు సార్లు ద్రాక్ష ర‌సాన్ని పురుషులు తీసుకుంటే చ‌ర్మంపై ఎటువంటి ఏజింగ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు.

వృద్ధాప్య ల‌క్ష‌ణాల‌ను దూరం చేయ‌డంలో నవ్వు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు మ‌న‌సారా కాసేపు న‌వ్వితే ముఖ కండరాలకు చక్కని వ్యాయామం దొరికి వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది.

ఒక‌వేళ చ‌ర్మంపై ముడ‌త‌లు ఉన్నా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.అలాగే డైట్‌ను త‌ప్ప‌ని స‌రిగా మార్చుకోవాలి.

రోజు ఏదో ఒక ఆకుకూర‌ను తీసుకోవాలి.తాజా పండ్లు, కూర‌గాయ‌లు, న‌ట్స్‌, తృణ‌ధాన్యాలు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

అదే స‌మ‌యంలో ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌, బేక‌రీ ఫుడ్స్‌, షుగ‌ర్‌, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఎవైడ్ చేయాలి.

మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను మానుకోవాలి. """/"/ ఇక రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌ల పాటు ఖ‌చ్చితంగా నిద్రించాలి.

శ‌రీరానికి స‌రిప‌డా వాట‌ర్‌ను అందించాలి.పండ్ల ర‌సాలు, కొబ్బ‌రి నీళ్లు త‌ర‌చూ తీసుకోవాలి.

మ‌రియు స్మార్ట్ఫోన్ల‌ను చూడ‌టం వీలైనంత వ‌ర‌కు త‌గ్గించాలి.త‌ద్వారా వృద్ధాప్య లక్షణాల‌కు దూరంగా ఉండొచ్చు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్